సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు కలకలం.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం..

తెలంగాణ ఉద్యమ సమయంలో తాను చాలా యాక్టివ్‌గా పనిచేశానని రవీందర్ చెప్పాడు. జిల్లాలో కేసీఆర్‌కు గుడి కట్టి పూజలు కూడా చేస్తున్నట్టు చెప్పాడు.

news18-telugu
Updated: November 15, 2019, 1:06 PM IST
సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు కలకలం.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు రవీందర్
  • Share this:
హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అనంతరం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. అతని పేరు రవీందర్,స్వస్థలం మంచిర్యాల జిల్లా. స్థానికంగా కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రవీందర్ ఓ రౌడీ షీటర్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా చెప్పాడు. రెండెకరాల పొలం అమ్మి తాను కేబుల్ నెట్‌వర్క్ నడుపుతున్నానని.. ఓ రౌడీ షీటర్ దాన్ని లాగేసుకున్నాడని ఆరోపించాడు. తనకు సంబంధించిన కొంత భూమిని కూడా అతను ఆక్రమించుకున్నట్టు ఆరోపించాడు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ,అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరకు ఏం చేయాలో తెలియక క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకు యత్నించినట్టు చెప్పుకొచ్చాడు.తెలంగాణ ఉద్యమ సమయంలో తాను చాలా యాక్టివ్‌గా పనిచేశానని రవీందర్ చెప్పాడు. జిల్లాలో కేసీఆర్‌కు గుడి కట్టి పూజలు కూడా చేస్తున్నట్టు చెప్పాడు. కేసీఆర్‌పై అభిమానంతో తన చేతిపై ఆయన పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నానని తెలిపాడు. ముఖ్యమంత్రి గారు తన సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...