• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MAN OPENS FIRE AT DELHI JAMIA MILLIA ISLAMIA UNIVERSITY ONE STUDENT INJURED SB

ఢిల్లీ జామియా వర్శిటీలో కాల్పులు... ఓ విద్యార్థికి గాయాలు

ఢిల్లీ జామియా వర్శిటీలో కాల్పులు... ఓ విద్యార్థికి గాయాలు

కాల్పుల్లో గాయపడిన ఫరూఖ్

ఓ వ్యక్తి అకస్మాత్తుగా విద్యార్థుల చేస్తున్న ర్యాలీని వ్యతిరేకిస్తూ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అతడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

  • Share this:
    ఢిల్లీ జామియా ఇస్లామియా యూనివర్శిటీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ అగంతకుడు కాల్పులు జరిపాడు. ఆజాద్ కావాలంటూ పెద్దగా అరుస్తూ ఓ వ్యక్తి కాల్పులకు దిగాడు.  ఆజాదీ కావాలా అంటూ రివాల్వర్‌తో బెదిరిస్తూ కాల్పులు జరిపాడు. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ర్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అకస్మాత్తుగా విద్యార్థుల చేస్తున్న ర్యాలీని వ్యతిరేకిస్తూ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అతడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి గాయాలపాలైనట్లు సమాచారం.అయితే విద్యార్థులు మాత్రం పోలీసులే కాల్పులకు దిగారంటూ ఆరోపిస్తున్నారు. సీఏఏ, ఎన్ఆర్సీకు వ్యతిరేకంగా జామియా కోఆర్డినేషన్ కమిటీ (జేసీసీ) ర్యాలీ నిర్వహించింది. జామియా నగర్ నుంచి రాజ్ ఘాట్ వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.
    Published by:Sulthana Begum Shaik
    First published: