పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బీజేపీ సభ్యత్వం.. ఫోర్జరీ చేశాడన్న కేసులో..

గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి ఓ కొంటె పని చేశాడు. గులాం ఫరీద్ షేక్(40) అనే వ్యక్తి ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కే బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 29, 2019, 5:40 PM IST
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు బీజేపీ సభ్యత్వం.. ఫోర్జరీ చేశాడన్న కేసులో..
ఇమ్రాన్, ఆశారాం బాపూ, రామ్ రహీమ్ బీజేపీ సభ్యత్వ ఈ-కార్డులు
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 29, 2019, 5:40 PM IST
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భారీ సంఖ్యలో కార్యకర్తలను చేర్చుకునేందుకు ఈ-సభ్యత్వాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పేరు, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, ఇతర సమాచారాన్ని అందించి.. సభ్యత్వం పొందే అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా లక్షలాది మంది కాషాయ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అయితే, గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి ఓ కొంటె పని చేశాడు. గులాం ఫరీద్ షేక్(40) అనే వ్యక్తి ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కే బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడు. పార్టీ వెబ్‌సైట్‌లో ఇమ్రాన్ ఖాన్ వివరాలు ఎంటర్, ఫోటోను అప్‌లోడ్ చేసి మెంబర్ షిప్ తీసుకున్నాడు. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుండటం వల్ల వివరాలను సర్టిఫై చేసే అవకాశం రాలేదు. అంతేకాదు.. రేప్ కేసుల్లో దోషులైన ఆశారాం బాపు, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌లకు కూడా సభ్యత్వం తీసుకున్నాడు.

సభ్యత్వానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. వాటిని చూసిన బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీయాలని ఇలాంటి పనులకు పాల్పడ్డాడని ఫరీద్‌పై కేసు పెట్టారు. ఫోర్జరీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...