‘మమత నాకు ప్రతీ ఏటా బట్టలు, మిఠాయి పంపిస్తారు’ బాలీవుడ్ హీరో అక్షయ్‌తో మోదీ చిట్ చాట్

ఏ ప్రధానికి దక్కని అవకాశం తనకు దక్కిందన్నారు. అంతేకాదు తాను ప్రధాని కావాలని ఎప్పుడూ కలగనలేదన్నారు. తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదన్నారు మోదీ.

news18-telugu
Updated: April 24, 2019, 10:40 AM IST
‘మమత నాకు ప్రతీ ఏటా బట్టలు, మిఠాయి పంపిస్తారు’ బాలీవుడ్ హీరో అక్షయ్‌తో మోదీ చిట్ చాట్
ప్రధాని మోదీతో బాలీవుడ్ అక్షయ్ ముఖాముఖి
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఈ సందర్భంగా అక్షయ్ అడిగిన వాటికి సమాధానమిస్తూ మోదీ పలు ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటానన్న మోదీ.. ఎవరిపై తన కోపాన్ని వ్యక్తం చేయనన్నారు. విపక్ష నేతల్లో కూడా తనకు చాలామంది స్నేహితులు ఉన్నారన్నారు. బెంగాల్ సీఎం మమత తనపై ఎన్ని విమర్శలు చేసినా ప్రతీ ఏటా మిఠాయిలు, కుర్తాలు పంపుతారన్నారు మోదీ. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ నాకు ఆప్త మిత్రుడన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఓబామ, తాను మంచి స్నేహితులమన్నారు ప్రధాని. గుజరాత్ సీఎంగా ఎక్కువకాలం పనిచేసిన విషయాల్ని గుర్తు చేసుకున్నారు. ఏ ప్రధానికి దక్కని అవకాశం తనకు దక్కిందన్నారు. అంతేకాదు తాను ప్రధాని కావాలని ఎప్పుడూ కలగనలేదన్నారు. తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదన్నారు. పనిపై ఇష్టాన్ని పెంచుకుంటే సులువుగా ఏ పనైనా చేసుకోవచ్చున్నారు మోదీ.

సోషల్ మీడియాలో కూడా తాను యాక్టివ్‌గా ఉంటానన్నారు మోదీ. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటివి ఫాలో అవతుంటాననన్నారు. తనపై సోషల్ మీడియాలో వచ్చిన జోకుల్ని ఎంజాయ్ చేస్తుంటానన్నారు. జోకుల్లో క్రియేటివిటీని చూస్తుంటానన్నారు ప్రధాని. సమయం వృథా చేయడం కూడా తనకు ఇష్టముండదన్నారు మోదీ. అందుకే సమావేశాల సమయంలో గడియారం లోపలికి ఉండేలా ధరిస్తానన్నారు. ఏదైనా భేటీ జరుగుతున్నప్పుడు టైం చూసుకుంటే అవతలి వ్యక్తిని అవమానించేవారమవుతామన్నారు.

First published: April 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు