నేడే అఖిలపక్ష భేటీ : మమతా, బాబు డుమ్మా.. హాజరవనున్న జగన్, కేటీఆర్..

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీకి హాజరుకావడం లేదు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆయన విదేశాల్లో పర్యటించాల్సి ఉన్నందునా భేటీకి దూరంగా ఉండనున్నారు. ముందు నుంచి ఇక కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా భేటీకి దూరంగానే ఉండనున్నారు.

news18-telugu
Updated: June 19, 2019, 2:49 PM IST
నేడే అఖిలపక్ష భేటీ : మమతా, బాబు డుమ్మా.. హాజరవనున్న జగన్, కేటీఆర్..
కేటీఆర్, జగన్(File)
news18-telugu
Updated: June 19, 2019, 2:49 PM IST
'వన్ నేషన్.. వన్ ఎలక్షన్..' అంశంపై చర్చించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం నేడు అఖిలపక్ష భేటీ నిర్వహించనుంది. లోక్‌సభ, రాజ్యసభల్లో కనీసం ఒక్క ఎంపీ ప్రాతినిధ్యంఉన్న ప్రతీ పార్టీ అధ్యక్షులను భేటీకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో భేటీకి ఎవరెవరు హాజరవుతున్నారు..ఎవరెవరు డుమ్మా కొడుతున్నారన్న చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. టీఆర్ఎస్ తరుపున అఖిలపక్ష భేటీకి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవనున్నారు. వైసీపీ తరుపున ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీకి హాజరవుతారని తెలుస్తోంది. అయితే జగన్ భేటీకి హాజరుకావడం లేదని ఆ పార్టీ నేతలు వెల్లడించినట్టుగా కథనాలు వస్తుండటం గమనార్హం.ఇక టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీకి హాజరుకావడం లేదు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆయన విదేశాల్లో పర్యటించాల్సి ఉన్నందునా భేటీకి దూరంగా ఉండనున్నారు.

ముందు నుంచి కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా భేటీకి దూరంగానే ఉండనున్నారు.ఈ భేటీకి తాను హాజరవట్లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి మమతా లేఖ రాశారు. ఇక విపక్ష కాంగ్రెస్ అఖిలపక్ష భేటీకి హాజరుకావడం లేదని ఆ పార్టీ నేత గౌరవ్ గొగొయ్ తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా భేటీకి దూరంగా ఉండనున్నారు.అఖిలపక్ష భేటీ సమావేశంలో ప్రధానంగా ఐదు అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు, ఒకే దేశం-ఒకే ఎన్నికలు, నవభారత నిర్మాణం,మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల నిర్వహణ, వెనుకబడిన జిల్లాల అభివృద్ది అనే అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.


First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...