MAMATA BENRJI WILL KEY ROLE IN THIRD FRONT SHE IS READY TO TAKE ACTION NGS
National Politics: బీజేపీ వ్యతిరేక కూటమికి నేత మమతే..! జాతీయ రాజకీయాల్లో స్పీడ్ పెంచిన దీదీ
బీజేపీ వ్యతిరేక కూటమి నాయకురాలు మమతా..?
బీజేపీ వ్యతిరేక కూటమికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఈ కూటమికి మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది.
కేంద్రంలో బీజేపీకి దూకుడుకు బ్రేకులు వేయడమే లక్ష్యంగా.. జాతీయ స్థాయిలో ప్రత్యేక కూటమి ఏర్పాటు దిశగా వడి వడిగా అడుగులు పడుతున్నాయి. తెరపై ఎందరో రాజకీయ నేతల పేర్లు వినిపిస్తున్నా.. తెర వెనుక ఉండి ఎన్నికల వ్యూహకర్తి ప్రశాంత్ కిషోర్ ఈ కూటమి బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన పలు ప్రాంతీయ పార్టీలను ఏక తాటిపైకి తీసుకురావడంలో పూర్తి సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా ఆయన మమంతా బెనర్జీ, శరద్ పవర్, సోనియా గాంధీలకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాట్లలో ఆయన బీజీ అయ్యారు. అయితే ఈ కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారు అన్నదానిపై మాత్రం ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలా..? లేదా మమతా, శరద్ పవర్ లాంటి లీడర్లను ముందు పెట్టి.. కాంగ్రెస్ ను కలుపు కొని వెళ్లాలా అన్నదానిపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మమత వెంట వెళ్లేందుకు ఇప్పటికే తమిళనాడు, ఢిల్లీ ప్రభుత్వాలు ఒప్పుకున్నట్టు సమాచారం. ఇటు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సీఎం కేసీఆర్ సైతం బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగమవ్వడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో జరుగుతున్న తాజా పరిణమాలు చూస్తే సీఎం జగన్ కూడా ఈ కూటమి వైపు అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి..
కూటమి సంగతి ఎలా ఉన్నా.. ఈ కూటమికి నేత ఎవ్వరు అన్నదే ఇప్పుడు ప్రధాన అంశం. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (2024) బీజేపీని గద్దెదించడానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీల కూటమి రూపుదిద్దుకుంటోందని రాజోర్ దళ్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ అన్నారు. ప్రాంతీయ శక్తుల సమాఖ్యగా ఏర్పడి.. మమతా బెనర్జీ తమ కూటమి నేతగా ప్రజల ముగింటకు వెళతామని తెలిపారు. సమాఖ్య వ్యవస్థపై తమకున్న విశ్వాసం, దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
అలాగే తృణమూల్ కాంగ్రెస్ లో రాజోర్ దళ్‌ను విలీనం చేయాలని మమత కోరారని, దీనిపై తమ పార్టీ కార్యనిర్వాహక కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజోర్ దళ్‌ను విలీనం చేస్తే టీఎంసీ అస్సాం శాఖ అధ్యక్షుడిని చేస్తానని తనకు మమత హామీ ఇచ్చారని అఖిల్ చెప్పారు. విలీనంపై ఇప్పటికే మూడుదఫాలుగా చర్చలు జరిగాయన్నారు. ఈ ఏడాది మార్చి–ఏప్రిల్ నెలల్లో జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల్ గొగోయ్ శివసాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. జైల్లో ఉండి అసెంబ్లీకి ఎన్నికైన తొలి అస్సామీగా గుర్తింపు పొందారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల్లో ప్రమేయం ఉందనే అభియోగాలపై అఖిల్ గొగోయ్‌ను 2019 డిసెంబరులో అరెస్టు చేశారు. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆయనపై మోపిన అభియోగాలను కొట్టివేయడంతో ఈ ఏడాది జూలై ఒకటో తేదీన జైలు నుంచి విడుదలయ్యారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.