Home /News /politics /

MAMATA BANERJEES KOLKATA RALLY ALL MAJOR POLITICAL PARTY LEADERS ATTENDING WHAT ABOUT KCRS FEDERAL FRONT BA

మమతా బెనర్జీ కోల్‌కతా ర్యాలీకి నేతల క్యూ: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పరిస్థితి ఏంటి?

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

ఇవాళ కోల్‌కతాలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేపట్టిన విపక్షాల ఐక్యతా ర్యాలీకి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మెజారిటీ రాజకీయ పార్టీల నేతలు హాజరవుతున్నారు. నేతలు అందరూ ఒక్కతాటి మీదకు వస్తే.. మరి కేసీఆర్ మొదలుపెట్టిన ఫెడరల్ ఫ్రంట్ ‌లోకి వచ్చేదెవరు అనే ప్రశ్న సహజంగా తలెత్తుతుంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు జరిగాయి. అయితే, అవి అనుకున్నంతగా సాగుతున్నాయా? ఆ ఫెడరల్ ఫ్రంట్‌లో ఉన్నదెవరు? వచ్చేదెవరు? అనే ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. టీడీపీ నేత, ఏపీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి. కేసీఆర్ చేపట్టిన ఫెడరల్ ఫ్రంట్‌కు ఫ్రంట్ లేదు, బ్యాక్ లేదు అంటూ సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఇవాళ కోల్‌కతాలో జరగనున్న విపక్షాల ఉమ్మడి సమరశంఖారావానికి బీజేపీ వ్యతిరేకంగా ఉన్న పార్టీల్లో చాలా వరకు హాజరవుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ టూర్లో భాగంగా ఎవరెవర్ని కలిశారో వారిలో చాలా మంది ఇప్పుడు మమతా బెనర్జీ మీటింగ్‌కు హాజరవుతున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించబోయే బహిరంగసభకు హాజరవుతున్నారు. వీరితోపాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, వివిధ పార్టీల నాయకులు అటెండ్ అవుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా మమతా బెనర్జీ ఫోన్ చేసి ఈ బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా కోరారు. అయితే, కేసీఆర్ వెళ్లడం లేదు.  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకావడం లేదు. ఆయన మమతా బెనర్జీకి ఓ లేఖ రాశారు. మమతా బెనర్జీ నిర్వహించే బహిరంగ సభ.. విపక్షాల ఐక్యతను బీజేపీకి చాటిచెప్పాలని సూచించారు.

    మమతా బెనర్జీతో కేసీఆర్
    మమతా బెనర్జీ, కేసీఆర్


    కేసీఆర్ ఇప్పటి వరకు కలిసిన వారిలో జేడీయూ ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీతో జట్టుకట్టి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఓ అడుగు ముందుకేసి రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటూ ప్రతిపాదించారు. దీంతో ఆ రెండు పార్టీలు ప్రస్తుతానికి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లోకి రానట్టే. ఇక మిగిలింది మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్. వారిలో నవీన్ పట్నాయక్ తాను ఫెడరల్ ఫ్రంట్‌లో చేరుతున్నట్టు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.

    cm kcr, mamata banerjee, kcr meets mamata banerjee, telangana cm kcr, kcr mamata banerjee, cm mamata banerjee, kcr and mamata banerjee, kcr meet mamata banerjee, cm kcr meets mamata banerjee, kcr meets cm mamata, kcr meets mamata, kcr to meet mamata banerjee, kcr and mamata banerjee meet, west bengal cm mamata banerjee, kcr on third front, cm kcr speech, kcr meets west bengal cm, federal front, kcr federal front, kcr on federal front, kcr federal front tour, federal front kcr, federal front tour, kcr's federal front, cm kcr on federal front, kcr to set federal front, kcr about federal front, kcr focus on federal front, kcr to focus on federal front, cm kcr focuses on federal front, kcr third front, cm kcr to visit ap today over federal front, ferderal front, federal front work, cm kcr, odisha cm naveen patnaik, kcr, cm naveen patnaik, naveen patnaik, kcr on naveen patnaik, kcr federal front, kcr meets naveen patnaik, kcr naveen patnaik meeting, cm kcr to meet naveen patnaik, kcr federal front tour, kcr naveen patnaik press meet, cm kcr to meet odisha cm naveen, kcr speech, kcr latest news, naveen patnaik on kcr, cm kcr to meet odisha cm naveen patnaik, telangana cm kcr, కేసీఆర్, జగన్, పవన్, బాబు, ఏపీలో కేసీఆర్ కు ఘన స్వాగతం, kcr to embark on ‘federal front’ tour, రూట్ మార్చిన కేసీఆర్ షాక్ లో జగన్ పవన్ బాబు, జగన్ & పవన్ ని కలిపేందుకు కేసీఆర్ ప్రయత్నం..!, నవీన్ పట్నాయక్, 6 రాష్ట్రాల, బ్రహ్మచారులే, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రులూ, మమతా బెనర్జీ, సిఎం కేసిఆర్ |, పాడద్దు, మరో ఫ్రంట్, పార్టీ నేతల, గుజరాత్‌లో బీజేపీ, వందేమాతరం, అన్నందుకు, గెలుపుపై మమతా, ఆగ్రహం చూడండి, పట్టలేకపోయిన, బీజేపీ గెలుపుపై ఆగ్రహం,
    కేసీఆర్, నవీన్ పట్నాయక్


    మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. అయితే, కచ్చితంగా యూపీఏకి మద్దతు ఇస్తామని మాత్రం ప్రకటించడం లేదు. అదే సమయంలో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా స్టాలిన్ ప్రతిపాదించినప్పుడు ఆమె సున్నితంగా తిరస్కరించారు. ఆ విషయాలన్నీ ఎన్నికలు అయ్యాక మాట్లాడుకోవాలని చెప్పారు. దీంతో చాన్స్ వస్తే తాను ప్రధాని అవ్వాలన్న ఆకాంక్ష ఆమెలో ఉందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది.

    SP, BSP and TMC ignoring Congress, seems KCR strategy working కాంగ్రెస్‌కు ఇబ్బందులు ? కేసీఆర్ ప్లాన్ పని చేస్తోందా ? ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ వంటి పార్టీలు ఎన్నికలకు ముందే తమతో కలిసి పనిచేస్తామని సంకేతాలు ఇస్తాయని కాంగ్రెస్ భావించింది. కానీ... ఈ పార్టీలన్నీ కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం పాటిస్తూనే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలనే యోచనతో ఉన్నట్టు అర్థమవుతోంది. దీంతో కేసీఆర్ చెబుతున్నట్టు ఈ పార్టీలన్నీ కాంగ్రెస్, బీజేపీలు లేని మూడో కూటమిలో భాగమయ్యే అవకాశం ఉంది.
    సోనియాగాంధీ, మాయావతి, మమతా బెనర్జీ (File)


    ఈ అన్ని పార్టీలు పోగా మిగిలిన రెండు ప్రధాన పార్టీలు ఎస్పీ, బీఎస్పీ. ఈ రెండు పార్టీలు యూపీలో జట్టుకట్టాలని నిర్ణయించారు. కేసీఆర్‌తో అఖిలేష్ ఓ సారి చర్చలు జరిపారు. మరో దఫా చర్చలు జరగాల్సి ఉంది. అయితే, వారిద్దరూ ఫెడరల్ ఫ్రంట్‌లో చేరతారా? లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరోవైపు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో కేటీఆర్ కూడా చర్చలు జరిపారు. కానీ, వైసీపీ కూడా తాము ఫెడరల్ ఫ్రంట్‌లో చేరుతున్నామని అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.

    Ys jagan ktr meet, ys jagan kcr alliance, ys jagan kcr friendship in Andhra Pradesh, kcr ys jagan alliance in ap, trs ysrcp in ap, వైఎస్ జగన్ కేటీఆర్ భేటీ, వైఎస్ జగన్ కేసీఆర్ ఆంధ్రప్రదేశ్, వైఎస్ జగన్ కేసీఆర్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    వైఎస్ జగన్, కేటీఆర్


    ప్రస్తుతం పరిణామాలన్నీ గమనిస్తున్న కేసీఆర్ ఏం చేస్తారా అని సస్పెన్స్ నెలకొంది.

    ఇవి కూడా చదవండి

     

    ఆర్మీలో ఆహారం బాగోలేదన్న జవాన్ కుమారుడి ఆత్మహత్య వీడియో
    First published:

    Tags: Chandrababu naidu, CM KCR, Deve gowda, Federal Front, Kumaraswamy, Mamata Banerjee, MK Stalin, Rahul Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు