• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MAMATA BANERJEE SAYS SHE WAS ATTACKED IN NANDIGRAM ELECTION COMMISSION SEEKS DETAILED REPORT BA

Mamata Banerjee: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై దాడి.. దీదీకి గాయాలు

Mamata Banerjee: నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై దాడి.. దీదీకి గాయాలు

గాయపడిన తర్వాత కారులో ఆస్పత్రికి వెళ్తున్న మమతా బెనర్జీ

‘నేను కారు డోర్ తీసి బయట పట్టుకుని ఉన్నా. నేను గుడికి వెళ్తున్నా. కొందరు వచ్చి నా కారు డోర్ తోసేశారు. నా కాలికి గాయం అయింది.’ అని మమతా బెనర్జీ చెప్పారు. మమతా బెనర్జీకి ఛాతీ నొప్పి, నడుము నొప్పి కూడా వచ్చిందని చెప్పారు.

  • Share this:
    పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద దాడి జరిగింది. నందిగ్రామ్‌లో పూజ చేసి వస్తున్న ఆమె మీద దాడి చేసినట్టు స్వయంగా మమతా బెనర్జీ వెల్లడించారు. ఆ సమయంలో పోలీసులు పెద్దగా లేరని, కనీసం ఎస్పీ కూడా అక్కడ లేరని చెప్పారు. కారు వద్దకు వెళ్తున్న సమయంలో నలుగురైదుగురు తనను తోసేశారని.. తన కాలికి గాయం అయిందని చెప్పారు. ‘నేను కారు డోర్ తీసి బయట పట్టుకుని ఉన్నా. నేను గుడికి వెళ్తున్నా. కొందరు వచ్చి నా కారు డోర్ తోసేశారు. నా కాలికి గాయం అయింది.’ అని మమతా బెనర్జీ చెప్పారు. మమతా బెనర్జీకి ఛాతీ నొప్పి, నడుము నొప్పి కూడా వచ్చిందని చెప్పారు. ఆ ఘటన తర్వాత వెంటనే ఆమె కోల్ కతాకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై సమగ్ర రిపోర్టు ఇవ్వాల్సిందిగా బెంగాల్ డీజీపీని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. శుక్రవారం లోపు తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

    మరో వైపు నందిగ్రామ్ లోని బ్లాక్ 1లో మమతా బెనర్జీ పర్యటనకు అద్భుత రెస్పాన్స్ వచ్చిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ చెప్పారు. ఈరోజు నందిగ్రామ్ బ్లాక్ 2లో పర్యటించినట్టు చెప్పారు. ఆమె పర్యటనకు ప్రజలు ఆదరంగా స్వాగతించారని తెలిపారు. మరోవైపు మమతా బెనర్జీ మీద జరిగిన దాడిని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.

    ఇది ప్లానింగ్ ప్రకారమే జరిగిన దాడి అనుకుంటున్నారా అని మమతను మీడియా అడిగినప్పుడు 'కచ్చితంగా ఇది కుట్రే. నా వెనుక సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ లేరు. కనీసం ఒక్క పోలీసు కూడా అక్కడ లేరు. నలుగురు నుంచి ఐదుగురు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే అందరూ చూస్తుండగా దురుసుగా వ్యవహరించారు. ఎస్‌పీనే కాదు, ఒక్క స్థానిక పోలీసు కూడా అక్కడ లేరు. ఇది కచ్చితంగా కుట్రే. ఇంత మంది జనం గుమిగూడి ఉన్నప్పటికీ 4 నుంచి 5 గంటల వరకూ ఒక్క పోలీసు అధికారి కూడా అక్కడకు రాలేదు' అని మమతా బెనర్జీ తెలిపారు.

    ఇక మమతా బెనర్జీ ఈ రోజు నందిగ్రామ్ లో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ముందు మమత.. ఇక్కడి మహారుద్ర సిధార్థ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆమె ఆలయంలోకి ప్రవేశించేముందు పెద్ద సంఖ్యలో మహిళలు శంఖం ఊదుతూ మమతా బెనర్జీకి ఘన స్వాగతం పలికారు. ఆమెతో కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు