డార్జిలింగ్ కొండల్లో 10కి.మీ రన్నింగ్ చేసిన సీఎం మమతా బెనర్జీ..

గురువారం 'ఇంటర్నేషనల్ క్లైమేట్ యాక్షన్ డే' సందర్భంగా మమతా ఇలా జాగింగ్ చేశారు. అంతకుముందు ట్విట్టర్ ద్వారా ఆమె బెంగాల్ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: October 25, 2019, 3:10 PM IST
డార్జిలింగ్ కొండల్లో 10కి.మీ రన్నింగ్ చేసిన సీఎం మమతా బెనర్జీ..
మమతా బెనర్జీ (ఫైల్ ఫొటో)
  • Share this:
తెల్లవారుజామున త్రెడ్‌మిల్‌పై నడకతో రోజును ప్రారంభించడం బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అలవాటు. ఆమె దినచర్య దాంతోనే మొదలవుతుంది. అలాంటి మమతా బెనర్జీ ఈరోజు త్రెడ్‌మిల్‌ను పక్కనపెట్టి.. రోడ్లపై జాగింగ్ చేశారు. ఏకంగా 10కి.మీ రన్నింగ్ చేసి యువతలో ఉత్సాహం నింపారు. గురువారం ఉదయం డార్జిలింగ్ కొండలపై జర్నలిస్టులు,కొంతమంది యువతతో కలిసి ఆమె పరుగులు పెట్టారు. మధ్యమధ్యలో మహారాష్ట్ర,హర్యానా ఎన్నికల వివరాలు తెలుసుకుంటూ.. దారిలో ఎదురయ్యే ప్రజలను
పలకరించుకుంటూ ముందుకు సాగారు. గురువారం 'ఇంటర్నేషనల్ క్లైమేట్ యాక్షన్ డే' సందర్భంగా మమతా ఇలా జాగింగ్ చేశారు. అంతకుముందు ట్విట్టర్ ద్వారా ఆమె బెంగాల్ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. ప్రతీ పౌరుడు పర్యావరణ పరిరక్షణకై ప్రతిజ్ఞ చేయాలన్నారు. పచ్చదనం-పరిశుభ్రతకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు.
First published: October 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు