హోమ్ /వార్తలు /National రాజకీయం /

Mamata Banerjee: ఆట ఇంకా ముగియలేదు.. రాష్ట్రపతి ఎన్నికలపై మమత కీలక వ్యాఖ్యలు..

Mamata Banerjee: ఆట ఇంకా ముగియలేదు.. రాష్ట్రపతి ఎన్నికలపై మమత కీలక వ్యాఖ్యలు..

పశ్చిమ బెంగాల్ ఒక దశాబ్దం పాటు తన రుణ స్థితిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. అది ఇప్పటికీ రాష్ట్ర మొత్తం జిడిపిలో 34.2 శాతంగా ఉంది. 2020-21లో ఇది 37 శాతం కాగా, 2010-11లో 40.7 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర మొత్తం ఆదాయంతో పోలిస్తే 296 శాతం బకాయిలు ఉండవచ్చని అంచనా. ఈ ఏడాది వృద్ధి రేటు 11.5 శాతంగా ఉంటుందని..  జీడీపీ పరిమాణం రూ.17.1 లక్షల కోట్లకు చేరుతుందని రాష్ట్రం విశ్వసిస్తోంది.

Mamata Banerjee: తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నిరేకెత్తిస్తున్నాయి.

Mamata Banarjee comments on Bjp:  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై పోరాడేందుకు అన్ని విధాల సిద్ధమవుతున్నామని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తాజాగా, తృణమూల్ బాస్ హిల్స్ అండ్ హోమ్ అఫైర్స్ బడ్జెట్ చర్చ సందర్భంగా అసెంబ్లీలో పలు వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ... తమ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. కొందరు కావాలనే ప్రతి విషయాన్ని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

వెస్ట్ బెంగాల్ లో ఎక్కడ  కూడా.. శాంతి భద్రతల సమస్యలు (law and Order issues) తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చేపట్టారని అన్నారు. బీజేపీ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) గెలవడంపై కూడా.. మమతా పలు వ్యాఖ్యలు చేశారు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికలు ప్రధానమన్నారు. దేశంలో ఉన్న మొత్తం శాసన సభ్యులలో బీజేపీ సగం కూడా లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో విజయం సాధించడం అంత సులభం కాదని మమత అన్నారు. తాము.. యూపీలో ఓడిపోయినప్పటికి గతంలో కంటె ఎక్కువ సీట్లు సాధించామని అన్నారు.

ఆయా రాష్ట్రలలో స్థానిక పార్టీలు బలంగా ఉన్నాయన తెలిపారు. ఇటీవల కాంగ్రెస్, తృణమూల్ కు చెందిన ఇద్దరు కౌన్సిలర్ ల హత్యలను ఖండించారు.  దీనిపై విచారణ చేపట్టామని, నిందితులను ఎంతటి వారైన వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇక సభలో బీజేపీ సభ్యులు, టీఎంసీ సభ్యులు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. దీంతో సభలో జైబంగ్లా, జై భారత్ నినాదాలతో హోరేత్తింది.

చివరకు బీజేపీ సభ్యుల సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికలు (Presidential Elections) పరోక్షంగా పార్లమెంటు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు ఎన్నికైన సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీతో ఎన్నికలు నిర్వహించబడతాయి. ఇప్పటికే 1971 జనాభా ప్రాతికదిక ఫార్మూలాను ఎన్నికలను నిర్వహిస్తారు. ఇటు బీజేపీ కూడా రాష్ట్రపతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

First published:

Tags: Bjp, Elections, Mamata Banerjee, President of India, West Bengal