ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా కోల్‌కతాలో మెగా ర్యాలీ : మమతా బెనర్జీ

సెంబర్ 16న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్దంతిని పురస్కరించుకుని కోల్‌కతాలో మెగా ర్యాలీ చేపట్టనున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంబేడ్కర్ విగ్రహం నుండి జొరసాంకో వరకు నిరసన ర్యాలీ జరుపుతామన్నారు.

news18-telugu
Updated: December 13, 2019, 4:07 PM IST
ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా కోల్‌కతాలో మెగా ర్యాలీ : మమతా బెనర్జీ
మమతా బెనర్జీ (File)
  • Share this:
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ నమోదు(ఎన్ఆర్‌సీ) చట్టాన్ని పశ్చిమ బెంగాల్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేయమని సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.రాష్ట్రం నుంచి ఏ ఒక్కరిని శరణార్థిగా బయటకు పంపించే ప్రసక్తే లేదన్నారు.కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగా డిసెంబర్ 16న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ వర్దంతిని పురస్కరించుకుని కోల్‌కతాలో మెగా ర్యాలీ చేపట్టనున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంబేడ్కర్ విగ్రహం నుండి జొరసాంకో వరకు నిరసన ర్యాలీ జరుపుతామన్నారు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం దేశాన్ని విభజించేలా ఉందని.. బెంగాల్‌లో తాము అధికారంలో ఉన్నంతవరకు ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు.

కేరళ సీఎం పినరయి విజయన్,పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించారు. తమ రాష్ట్రాల్లో ఎన్‌ఆర్‌సీని అమలుచేసేది లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇప్పటికే సుప్రీం కోర్టులో

పిటిషన్ దాఖలు చేసింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్,కాంగ్రెస్ పార్టీలు కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుప్రీం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


Published by: Srinivas Mittapalli
First published: December 13, 2019, 4:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading