కోల్‌కతాలో మమతా మెగా మార్చ్.. ఎన్‌ఆర్‌సీపై నిరసన..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ నమోదు(ఎన్ఆర్‌సీ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో 'మెగా మార్చ్' చేపట్టారు.

news18-telugu
Updated: December 16, 2019, 1:43 PM IST
కోల్‌కతాలో మమతా మెగా మార్చ్.. ఎన్‌ఆర్‌సీపై నిరసన..
Video : కోల్‌కతాలో మమతా మెగా మార్చ్.. ఎన్‌ఆర్‌సీపై నిరసన
  • Share this:
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ నమోదు(ఎన్ఆర్‌సీ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో 'మెగా మార్చ్' చేపట్టారు. కోల్‌కతాలోని అంబేడ్కర్ విగ్రహం నుండి జొరసాంకో వరకు దాదాపు 7కి.మీ వరకు వేలాదిమంది కార్యకర్తలతో ఆమె ర్యాలీ నిర్వహించనున్నారు. తాము శాంతియుత ర్యాలీ చేపడుతున్నామని, ఎక్కడా హింసాత్మక ఘటనలకు తావు లేదని టీఎంసీ నేతలు చెబుతున్నారు. ప్రజా మద్దతుతో ఎన్‌ఆర్‌సీని అడ్డుకుని తీరుతామంటున్నారు.

కాగా, ఎన్‌ఆర్‌సీని బెంగాల్‌లో అమలుచేసే ప్రసక్తే లేదని ఇదివరకే మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్ నుంచి ఏ ఒక్కరిని శరణార్థిగా బయటకు పంపించమని తెగేసి చెప్పారు. ఎన్‌ఆర్‌సీని మొట్టమొదట వ్యతిరేకించిన సీఎం మమతా బెనర్జీనే. ఆమె తర్వాత కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కూడా ఎన్‌ఆర్‌సీ చట్టాన్ని వ్యతిరేకించారు. తమ రాష్ట్రాల్లో ఎన్‌ఆర్‌సీని అమలుచేయబోమని ప్రకటించారు.


First published: December 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు