• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MAMATA BANARJEE TO CONTEST FROM NANDIGRAM TMC ANNOUNCES 291 CANDIDATES BA

West Bengal: నందిగ్రామ్ బరిలో మమతా.. 291 మంది అభ్యర్థుల ప్రకటన

West Bengal: నందిగ్రామ్ బరిలో మమతా.. 291 మంది అభ్యర్థుల ప్రకటన

మమతా బెనర్జీ (Image; ANI/Twitter)

పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 294 నియోజకవర్గాలు ఉన్న బెంగాల్లో 291 మంది అభ్యర్థులను మొదటి విడుతలోనే ప్రకటించింది.

  • Share this:
    పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 294 నియోజకవర్గాలు ఉన్న బెంగాల్లో 291 మంది అభ్యర్థులను మొదటి విడుతలోనే ప్రకటించింది. ఆ జాబితాలో మహిళలు 51 మంది, మైనారిటీలు 42 మంది, ఎస్సీలు 79, ఎస్టీలు 17 మంది టికెట్లు దక్కించుకున్నారు. ఈసారి 27 నుంచి 28 మంది యువకులకు సీట్లు ఇస్తున్నామని మమతా బెనర్జీ ప్రకటించారు. కోల్ కతాలో జరిగిన మీడియా సమావేశంలో అభ్యర్థులను మమతా బెనర్జీ ప్రకటించారు. ఈసారి కరోనా నేపథ్యంలో 80 ఏళ్లకు పైబడిన వారికి టికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. మమతా బెనర్జీ ఈసారి నందిగ్రామ్ నుంచి బరిలో దిగుతున్నారు. తనకు పెట్టని కోటలాంటి చోట ఆమె మరోసారి సత్తా చాటడానికి నిర్ణయించారు. ఉత్తర బెంగాల్లోని మూడు సీట్లలో తమ పార్టీ అభ్యర్థులను పోటీ పెట్టడం లేదని మమతా బెనర్జీ ప్రకటించారు. ఆ స్థానాల్లో తమ పొత్తు పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, జేఎంఎం అధినేత హేమంత్ సొరేన్ మద్దతు పలికారని వారికి కృతజ్ఞతలు చెప్పారు.

    పశ్చిమ బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి 

    మొదటి దశ ఎన్నికలు - మార్చి 27
    రెండో దశ ఎన్నికలు - ఏప్రిల్ 1
    మూడో దశ ఎన్నికలు - ఏప్రిల్ 6
    నాలుగో దశ ఎన్నికలు - ఏప్రిల్ 10
    ఐదో దశ ఎన్నికలు - ఏప్రిల్ 17
    ఆరో దశ ఎన్నికలు - ఏప్రిల్ 22
    ఏడో దశ ఎన్నికలు - ఏప్రిల్ 26
    ఎనిమిదో దశ ఎన్నికలు - ఏప్రిల్ 29

    మే 2న కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరితో పాటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

    ప్రస్తుతం భవానీపూర్ ఎమ్మెల్యేగా ఉన్న మమతా బెనర్జీ ఈ సారి నందిగ్రామ్ నుంచి పోటీ చేయనున్నారు. ఆ స్థానాన్ని మరో నేతకు అప్పగించారు. ఇటీవల టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన సువేందు అధికారి ఇప్పటికే తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారనుంది.

    141 మంది ఓసీలు, 19 మంది ఓబీసీలు, 70 మంది ఎస్సీలు (వారిలో 11 మంది ఎస్సీలు జనరల్ సీట్లలో పోటీ), 17 మంది ఎస్టీలు, 35 మంది ముస్లింలు పోటీ చేయనున్నారు. మొత్తం 291 మందిలో 240 మంది పురుషులు ఉన్నారు. 51 మంది మహిళలు ఉన్నారు. కొందరు సినిమా వారికి కూడా టికెట్లు దక్కాయి. నటి జూన్ మలయ్య మిడ్నాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. దర్శకుడు రాజ్ చక్రవర్తి బరాక్ పూర్ టికెట్ దక్కించుకున్నారు.

    పశ్చిమ బెంగాల్లో రెండుదఫాలుగా అధికారంలో ఉంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. మూడోసారి కూడా అధికారాన్ని నిలబెట్టుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. అదే సమయంలో బెంగాల్లో మమతా బెనర్జీని గద్దె దింపి కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ జరుగుతోంది. తృణమూల్ నేతలకు కాషాయ కండువా కప్పుతోంది. బీజేపీ అగ్రనేతలు కూడా బెంగాల్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి.. అక్కడ ప్రత్యేకంగా వ్యూహాలు పన్నుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు