టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం తెలంగాణలో కాకా రేపుతోంది. టీఆర్ఎస్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇందిరా పార్కు వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన భట్టికి కాంగ్రెస్ నేతలు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం మద్దతు తెలిపారు. ఇక ఆదివారం దీక్షాస్థలికి వెళ్లిన రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్.
తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదని కల్వకుంట్ల రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. కేసీఆర్ అరాచకాలకు నిరసనగా దీక్ష చేస్తున్నాం. భట్టి విక్రమార్క ప్రశ్నించేతత్వం, సమర్ధుడనే కారణంతో కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంది. సీఎల్పీ విలీనం స్పీకర్ పరిధిలో ఉండదు. 12 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదుచేస్తే పట్టించుకోని స్పీకర్ సీఎల్పీ విలీనాన్ని ఎలా ఆమోదిస్తారు.
— రేవంత్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ
కేసీఆర్ రాజకీయ ఉన్మాదానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులపై పెట్టిన శ్రద్ధ...డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ సమస్యలపై పెడితే బాగుంటుందని విరుచుకుపడ్డారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.