‘ఆ పాపం మీదే...’ సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ బహిరంగ లేఖ..

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

news18-telugu
Updated: August 9, 2020, 6:03 PM IST
‘ఆ పాపం మీదే...’ సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ బహిరంగ లేఖ..
రేవంత్ రెడ్డి, కేసీఆర్
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నాలుగు పేజీల లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ లో నీటిపారుదల ప్రాజెక్టుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేసీఆర్ తొక్కి పెట్టారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఆయన ఈ లేఖతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపారు. ‘ఏపీ అక్రమ ప్రాజెక్టులకు మీ పరోక్ష సహకారం ఉంది. ఆగస్ట్ 5న జల వివాదాల సమస్య పరిష్కారానికి రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే... దాని వాయిదాకు మీరు లేఖ రాయడం దీనికి నిదర్శనం. నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ ఎందుకు తొక్కి పెట్టారు. లక్షా 7 వేల ఎకరాలకు సాగునీరు రాకుండా చేసిన పాపం మీదే. పాలమూరు-రంగారెడ్డి స్కీంతో నారాయణపేట్, కొడంగల్ ప్రాంతాలకు ఒరిగేది ఏమీ లేదు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ స్కీం సామర్థ్యం ఒక టీఎంసీ తగ్గించారు. తద్వారా ఆ ప్రాజెక్టు నుంచి నారాయణపేట్, కొడంగల్ కు నీళ్లు రావడం కల్లే. నారాయణపేట్-కొడంగల్ స్కీం ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైంది. తొలి దశకు రూ.133 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయి. మీరు అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా ఆ ప్రాజెక్టును తొక్కిపెట్టారు. నారాయణపేట్-కొడంగల్ స్కీంను తక్షణం ప్రారంభించాలి.’ అని రేవంత్ డిమాండ్ చేశారు.

ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే... తెలంగాణ సర్కారు సక్రమ ప్రాజెక్టులు కూడా కట్టడం లేదని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై సుప్రీంలో వేసిన కేసులో పసలేదన్నారు. వైసీపీ కీలక నేతలు తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్ల పనులు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 9, 2020, 6:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading