హరీశ్‌ రావుకు కొడంగల్ శాపం... రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Revanth reddy comments on Harish Rao | మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన అనంతరం తొలిసారి కొడంగల్‌ వచ్చి రేవంత్ రెడ్డి... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కొడంగల్ వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆయన అన్నారు.

news18-telugu
Updated: July 20, 2019, 11:26 AM IST
హరీశ్‌ రావుకు కొడంగల్ శాపం... రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి, హరీశ్ రావు(File)
  • Share this:
మాజీమంత్రి హరీశ్ రావుపై మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ శాపం తగిలింది కాబట్టే హరీశ్ రావు సిద్ధిపేటకు పరిమితమయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పొట్టొని నెత్తి పొడుగోడు కొడితే... పొడుగోడి నెత్తిని పోచమ్మ కొట్టినట్టుగా హరీశ్ రావు పరిస్థితి తయారైందని హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. ఎన్నికల తరువాత హరీశ్ రావు ఎక్కడున్నారో అందరికీ తెలుసు అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కొడంగల్‌తో పెట్టుకున్నవాడేవడు బాగుపడలేదని అన్నారు. కొడంగల్‌ గల్లీలో టీఆర్ఎస్ తనను ఓడిస్తే... కొడంగల్ బిడ్డలు మల్కాజ్ గిరి వచ్చి ప్రచారం చేసి తనను ఏకంగా ఢిల్లీకి పంపించారని రేవంత్ రెడ్డి అన్నారు.

మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచిన అనంతరం తొలిసారి కొడంగల్‌ వచ్చి రేవంత్ రెడ్డి... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కొడంగల్ వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ గెలిచిన తరువాత కొడంగల్‌లో అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధినే టీఆర్ఎస్ తమ అభివృద్ధిగా చెప్పుకుంటోందని విమర్శించారు. దీనిపై చర్చకు సిద్ధమా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను ఢిల్లీకి వెళుతున్నానంటే అదంతా కొడంగల్ ప్రజల ఆశీర్వాదమే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>