బీజేపీలోకి వెళ్లడంపై స్పందించిన రేవంత్ రెడ్డి..ఏమన్నారంటే..

నరేంద్ర మోదీ, అమిత్ షా విభజన రాజకీయాలను తిప్పి కొడతామని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: May 28, 2019, 3:05 PM IST
బీజేపీలోకి వెళ్లడంపై స్పందించిన రేవంత్ రెడ్డి..ఏమన్నారంటే..
రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడతారని కొన్నిరోజులుగా తెలంగాణలో ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి విజయం సాధించిన ఆయన త్వరలో బీజేపీ గూటికి చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే తనపై సోషల్ మీడియాల జరుగుతున్న ప్రచారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తన మీద నమ్మకంతో రాహుల్ గాంధీ టికెట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. వ్యాపారం కోసమే సామాజిక మాధ్యమాల్లో తప్పడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం, మినీ భారతదేశం మల్కాజిగిరిలో ప్రజలు నన్ను ఆశీర్వదించారు. కొడంగల్‌లో కేసీఆర్‌, హరీష్‌ రావు నాపై కుట్రలు చేసి ఓడించారు. ప్రశ్నించే గొంతుక ఉండాలన్న ఉద్దేశంతోనే మల్కాజిగిరి ప్రజలు నన్ను గెలిపించారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిలబెట్టుకుంటా. వారికిచ్చిన హామీలను నెరవేరుస్తాను. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు. నాపై నమ్మకంతో రాహుల్ గాంధీ టికెట్ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.
రేవంత్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ


గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డితో కలసి రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపైనా ఆయన విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా విభజన రాజకీయాలను తిప్పి కొడతామని స్పష్టంచేశారు.
First published: May 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు