• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MAKE IT LIKE A FESTIVAL TRS MLA HARISH RAO URGES PEOPLE ON KALESHWARAM PROJECT BA

కాళేశ్వరం ప్రారంభోత్సవం వేళ.. ప్రజలకు హరీశ్‌రావు పిలుపు ఇదే

కాళేశ్వరం ప్రారంభోత్సవం వేళ.. ప్రజలకు హరీశ్‌రావు పిలుపు ఇదే

హరీష్ రావు (File)

కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని ఓ పండుగలా నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు , మహిళ సంఘాలు, పార్టీ శ్రేణులు ఈ సంబురాల్లో పాల్గొని ఘనంగా నిర్వహించాలి అని పిలుపునిచ్చారు.

  • Share this:
    కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమ విజయం అని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణరాష్ట్రం కోటి ఎకరాల మాగాణి కావాలని కేసీఆర్ కలలు కన్నారని హరీశ్ రావు చెప్పారు. సిద్ధిపేట నియోజకవర్గం చిన్నకోడూర్‌ మండలంలో జరిగిన సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు అంతర్రాష్ట్ర వివాదంగా మారిందన్నారు. అయితే, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాత్రింబవళ్లు కష్టపడి ప్రాజెక్టును రీ డిజైన్ చేశారని చెప్పారు. అలాంటి ప్రాజెక్టు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరుపుకొంటుందన్నారు. కరువును పారద్రోలే గొప్ప ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రారంభోత్సవాన్ని ఓ పండుగలా నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాన సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు , మహిళ సంఘాలు, పార్టీ శ్రేణులు ఈ సంబురాల్లో పాల్గొని ఘనంగా నిర్వహించాలి అని పిలుపునిచ్చారు. సిద్దిపేట నియోజకవర్గానికి మిడ్ మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్ ద్వారా తాగునీరు రానుందన్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు