GHMC Elections: ప్రధాన పోటీ BJP-MIM మధ్యే..TRS అసలు పోటీ లో లేదట

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరో సారి టీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర వాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు జోకర్లు, ఎంటర్ టైనర్లుగా మారుతున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ మధ్యే ఫైట్ అని అన్నారు. టీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదన్నారు.

news18-telugu
Updated: November 19, 2020, 6:46 PM IST
GHMC Elections: ప్రధాన పోటీ BJP-MIM మధ్యే..TRS అసలు పోటీ లో లేదట
ధర్మపురి అర్వింద్(ఫైల్ ఫొటో)
  • Share this:
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో జీహెచ్ఎంసీ రాజకీయం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరో సారి టీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర వాఖ్యలు చేశారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు జోకర్లు, ఎంటర్ టైనర్లుగా మారుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎంటర్ టైన్ మెంట్ కావాలంటే ప్రజలు కేసీఆర్, కేటీఆర్ ప్రెస్ మీట్లు చూడాలన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ మధ్యే ఫైట్ అని అన్నారు. టీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదన్నారు. టీఆర్ఎస్ కు ఏమైనా సీట్లు వస్తే తప్పకుండా ఎంఐఎం అభ్యర్థే మేయర్ అవుతారన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఓల్డ్ సిటీకి, మిగతా సిటీకి మధ్య పోటీ అని అన్నారు. తమ వ్యూహాలను ప్రచారంలోనే చూపిస్తామన్నారు. కేసీఆర్ పెడతానన్న ఫెడరల్ ఫ్రంట్ కనిపించలేదని.. థార్డ్ ఫ్రంట్ పత్తా లేదన్నారు. కేసీఆర్ ఇప్పుడు కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తే దేశాలన్నీ భయపడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. భయటకు వెళ్తే ప్రజలు కొడతారని కేసీఆర్, కేటీఆర్ భయపడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారని విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై కేసీఆర్ చేసిన‌ వ్యాఖ్యలు దారుణమని మండిపడ్డారు. ప్రపంచంలో భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టిన ప్రధాని మోదీపై విమర్శలు చేయడం సరికాదన్నారు. మోదీపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. కేసీఆర్ అంత దుర్మార్గపు సీఎం ఎక్కడా లేడని.. రాష్ట్ర ప్రజలు ఆయనను చూసి సిగ్గు పడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు బార్లు, వైన్సే మిగులుతాయని తీవ్రస్థాయితో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు కేసీఆర్‌కు కనిపించడం లేదా అంటూ నిలదీశారు. ఎవరి ఓట్ల కోసం దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కుల అహంకారం ఎక్కువని విమర్శించారు. ఎంఐఎం ఉగ్రవాద సంస్థ అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను ఎంఐఎం చేతుల్లో పెట్టాలని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందని.. అందుకే ఫ్రంట్‌ల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్తే ఆయనను ఎవరూ పట్టించుకోరని అన్నారు.
Published by: Nikhil Kumar S
First published: November 19, 2020, 6:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading