ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ... కూతురితో కలిసి సోషల్ మీడియాలో మెసేజ్...

వెళ్లి ఓటేయండి... అంటూ కూతురు జీవా సింగ్ ద్వారా ప్రజలకు మెసేజ్ ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ... ఐపీఎల్ బిజీ షెడ్యూల్‌లోనూ ఓటు హక్కు వినియోగించుకున్న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 6, 2019, 7:01 PM IST
ఓటు హక్కు వినియోగించుకున్న ధోనీ... కూతురితో కలిసి సోషల్ మీడియాలో మెసేజ్...
భార్య, తల్లిదండ్రులతో మహేంద్ర సింగ్ ధోనీ
  • Share this:
ఐపీఎల్ సీజన్‌లో మొట్టమొదట ఫ్లేఆఫ్‌కు చేరిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. వరుస విజయాలతో దూకుడు చూపించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు... ఫ్లేఆఫ్‌లో చేరినా టేబుల్ టాప్‌లో మాత్రం నిలవలేకపోయింది. చివరి మ్యాచ్‌లో ఓడి, సెకండ్ ప్లేస్‌కు పడిపోయింది. మంగళవారం టేబుల్ టాప్‌లో ఉన్న రోహిత్ టీమ్ ముంబై ఇండియన్స్‌తో తలబడబోతోంది చెన్నై. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో తెగ ప్రాక్టీస్ చేస్తూ చెమటోడుస్తున్నారు. అయితే చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం... మరోసారి తన కూల్ యాటిట్యూడ్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. ప్రాక్టీస్‌ను పక్కనబెట్టి, ఓ పౌరుడిగా తన కర్తవ్యం నిర్వహించేందుకు ఓటు హక్కు వినియోగించుకున్నాడు ధోనీ. రాంఛీలోని జవహార్ విద్యామందిరంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంతో కుటుంబసమేతంగా వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు ధోనీ.

ధోనీతో పాటు ఆయన భార్య సాక్షి సింగ్, తల్లిదండ్రులు దేవికా దేవి, పాన్ సింగ్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. ఓటు వేసి ఇంటికి వెళ్లిన తర్వాత కూతురు జీవా సింగ్ ధోనీతో కలిసి ఓ వీడియో పోస్ట్ చేశాడు ధోనీ. సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో... ‘పప్పా... మమ్మ... ఓటు వేశారు. మీరు కూడా వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోండి...’ అంటూ తన ముద్దుముద్దు మాటలతో మెసేజ్ ఇచ్చింది జీవా సింగ్. దానికి ధోనీ ‘థ్యాంక్స్’ అంటూ ఓటు వేసిన వేలు చూపిస్తూ రిప్లై ఇచ్చాడు. జీవా సింగ్ ధోనీ పోస్ట్ చేసే వీడియోల్లాగే ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

View this post on Instagram

Use your Power

A post shared by M S Dhoni (@mahi7781) on

First published: May 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...