నాకు సూపర్‌స్టార్ మహాత్మాగాంధీయే.. గాడ్సే విలన్ అంటున్న ప్రముఖ హీరో

Political News : మహాత్మా గాంధీ ‘సూపర్‌ స్టార్’‌ అని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ కొనియాడారు. ఓ విలన్‌(గాడ్సేను ఉద్దేశించి)ను తాను హీరోగా అంగీకరించనని చెప్పారు.

news18-telugu
Updated: May 20, 2019, 1:14 PM IST
నాకు సూపర్‌స్టార్ మహాత్మాగాంధీయే.. గాడ్సే విలన్ అంటున్న ప్రముఖ హీరో
మహాత్మాగాంధీ (Image: Getty Images)
  • Share this:
మహాత్మా గాంధీ ‘సూపర్‌ స్టార్’‌ అని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ కొనియాడారు. ‘స్వతంత్ర భారతంలో తొలి తీవ్రవాది హిందూ’ అంటూ గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఓ విలన్‌(గాడ్సేను ఉద్దేశించి)ను తాను హీరోగా అంగీకరించనని చెప్పారు. ‘గాంధీజీ సూపర్ స్టార్‌. ఆయన ఓ సారి ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన రైలు ఎక్కారు. ఆ సమయంలో ఆయన కాలుకి ఉన్న ఓ పాదరక్ష కిందపడింది. దీంతో ఆయన మరో కాలికి ఉన్న పాదరక్షను కూడా కింద పడేశారు. ఆ రెండు పాదరక్షలు మరొకరికి ఉపయోగపడతాయని ఆయన భావన’ అని వ్యాఖ్యానించారు. గాంధీ హత్యకు గురైన రోజును కమల్ గుర్తు చేస్తూ ‘ఓ సినిమా సమయంలో నేను ఓ విషయాన్ని తెలుసుకున్నాను. ఆ ఘర్షణ జరిగిన సమయంలో గాంధీజీ కళ్లజోడు, చెప్పులు పోయాయి’ అని వ్యాఖ్యానించారు.

ఇటీవల తాను చేసిన ‘స్వతంత్ర భారతంలో తొలి తీవ్రవాది హిందూ’ వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ‘ఓ విలన్‌ను నేను హీరోగా అంగీకరించను’ అని తెలిపారు. గాంధీజీయే తన హీరో అని ఆయన అన్నారు. తనపై ఇటీవల ఒకరు చెప్పు విసిరిన ఘటనపై కమల్ మాట్లాడుతూ... ‘నాపై చెప్పు విసిరిన వ్యక్తికే ఇది అవమానం’ అని అన్నారు.
First published: May 20, 2019, 1:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading