దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త రికార్డు.. ఆ ఇద్దరి తర్వాత ఆయనే..

మహారాష్ట్ర చరిత్రలో ఐదేళ్లు పూర్తి కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నాయకుడిగా కూడా ఫడ్నవీస్ చరిత్రలోకి ఎక్కారు. అంతకుముందు కాంగ్రెస్ నేత వసంత్‌రావ్ నాయక్ మాత్రమే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పదవిలో కొనసాగారు.

news18-telugu
Updated: November 27, 2019, 10:40 AM IST
దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త రికార్డు.. ఆ ఇద్దరి తర్వాత ఆయనే..
మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
  • Share this:
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొత్త రికార్డులు సృష్టించారు. దేశ చరిత్రలో అత్యల్ప కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మూడో నాయకుడిగా ఆయన చరిత్రలోకి ఎక్కారు.రెండోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 3 రోజులకే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.గతంలో ప్రస్తుత కర్ణాటక సీఎం యడ్యూరప్ప,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం జగదాంబిక పాల్ అత్యల్పంగా 2 రోజులు మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగి రికార్డుల్లోకి ఎక్కారు. మే17,2018న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప.. అదే ఏడాది మే 19న రాజీనామా చేశారు. ఇక ఫిబ్రవరి 21,1988న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగదాంబిక పాల్ ఫిబ్రవరి 23,1988న రాజీనామా చేశారు.అంటే కేవలం 2 రోజులు మాత్రమే సీఎం పదవిలో కొనసాగారు.

మహారాష్ట్ర చరిత్రలో ఐదేళ్లు పూర్తి కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నాయకుడిగా కూడా ఫడ్నవీస్ చరిత్రలోకి ఎక్కారు. అంతకుముందు కాంగ్రెస్ నేత వసంత్‌రావ్ నాయక్ మాత్రమే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పదవిలో కొనసాగారు.ఇదిలా ఉంటే, అజిత్ పవార్ మద్దతుతో రాత్రికే రాత్రే మహారాష్ట్ర సమీకరణాలను మార్చేసిన బీజేపీకి చివరకు భంగపాటు తప్పలేదు.

First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>