• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • MAHARASHTRA UNDER PRESIDENT RULE FOR THE THIRD TIME HERE IS THE LIST BA

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. ఇది ఎన్నోసారో తెలుసా?

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. ఇది ఎన్నోసారో తెలుసా?

న్యూస్ 18 క్రియేటివ్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలు కావడం ఇది మూడోసారి. 1980లో మొదటిసారి, 2014లో రెండోసారి రాష్ట్రపతి పాలన అమలైంది.

  • Share this:
    మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ గవర్నర్ భగత్‌సింగ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానిపై కేంద్రకేబినెట్ అత్యవసరంగా చర్చించి నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయం తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. మరోవైపు తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, రెండు రోజుల గడువు కోరినా గవర్నర్ ఇవ్వకపోవడంపై శివసేన అభ్యంతరం తెలిపింది. గవర్నర్ నిర్ణయంపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    అయితే, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలు కావడం ఇది మూడోసారి. 1980లో మొదటిసారి, 2014లో రెండోసారి రాష్ట్రపతి పాలన అమలైంది. 1980 ఫిబ్రవరి 17 నుంచి 1980 జూన్ 8 వరకు 112 రోజుల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉన్నా కూడా ఆయన ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసి.. రాష్ట్రపతి పాలన విధించింది. ఆ తర్వాత 2014 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు 33 రోజుల పాటు రెండోసారి రాష్ట్రపతి పాలన నడిచింది. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్.. ఎన్సీపీ, ఇతరుల నుంచి విడిపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ అయింది. తాజాగా మూడోసారి నవంబర్ 12 నుంచి మూడోసారి అమల్లోకి వచ్చింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: