మహా'ప్రతిష్టంభన'కు తెర..! ముఖ్యమంత్రి పీఠం చేపట్టనున్న శివసేన

శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవగాహన కుదిరిన నేపథ్యంలో ఈ నెల 17న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ కానున్నారు.

news18-telugu
Updated: November 15, 2019, 10:36 AM IST
మహా'ప్రతిష్టంభన'కు తెర..! ముఖ్యమంత్రి పీఠం చేపట్టనున్న శివసేన
ఉద్దవ్ థాక్రే,శరద్ పవార్,సోనియా గాంధీ (News18 creatives)
  • Share this:
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన వీడినట్టే కనిపిస్తోంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఐదేళ్ల పాటు శివసేనకే ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు ఎన్సీపీ,కాంగ్రెస్ అంగీకరించినట్టు తెలుస్తోంది. అలాగే ఎన్సీపీ,కాంగ్రెస్‌లకు డిప్యూటీ సీఎం సహా 14 మంత్రి పదవులు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. అలాగే మూడు పార్టీలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళికను కూడా రూపొందించుకున్నట్టు సమాచారం. ఇందులో ఆర్ఎస్ఎస్ నేత వీర్ సావర్కర్‌కి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్‌ను శివసేన
పెట్టింది. అలాగే ముస్లింలకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్‌ను ఎన్సీపీ,కాంగ్రెస్ పొందుపరిచాయి.ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు.

శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవగాహన కుదిరిన నేపథ్యంలో ఈ నెల 17న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ కానున్నారు. శివసేనతో ప్రభుత్వ ఏర్పాటు,భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన చర్చించనున్నారు.

కాగా,ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ శివసేన సీఎం పోస్టు కోరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు శివసేనతో ఎన్సీపీ,కాంగ్రెస్‌లకు అంగీకారం కుదరడంతో.. ఈ మూడు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉంది.


First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...