మహా వికాస్ అఘాడీ : ఏ పార్టీకి ఏయే పదవులు..

మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గడం లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది. తదనంతరం జరిగే పదవుల పంపకం పైనే అందరి దృష్టి నెలకొంది.

news18-telugu
Updated: November 30, 2019, 12:27 PM IST
మహా వికాస్ అఘాడీ : ఏ పార్టీకి ఏయే పదవులు..
ఉద్దవ్ థాక్రే,సోనియా గాంధీ,శరద్ పవార్
  • Share this:
మహారాష్ట్రలో 'మహా వికాస్ అఘాడీ' ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఉద్దవ్ థాక్రే నేడు బలపరీక్షకు సిద్దమయ్యారు. మధ్యాహ్నం 2గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశమై బలపరీక్ష జరపనుంది. ప్రొటెం స్పీకర్‌గా ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ఇప్పటికే ఎన్నికయ్యారు. కొత్త స్పీకర్ ఎంపిక ఆదివారం జరగనుండగా.. స్పీకర్ దరఖాస్తులకు తుది గడువు శనివారం మధ్యాహ్నం 12గంటలకు ముగియనుంది.

ఇదిలా ఉంటే, మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గడం లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది. తదనంతరం జరిగే పదవుల పంపకం పైనే అందరి దృష్టి నెలకొంది. మహా రాజకీయాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీకి రెవెన్యూ,ఎక్సైజ్,పబ్లిక్ వర్క్స్ డెవలప్‌మెంట్ శాఖలు దక్కే అవకాశం ఉంది. ఎన్సీపీకి హోంశాఖతో పాటు ఆర్థికశాఖ, అటవీశాఖలు దక్కే అవకాశం ఉంది. ఇక శివసేనకు అర్బన్ డెవలప్‌మెంట్‌,హౌజింగ్,సాగునీటి శాఖలు దక్కే అవకాశాలున్నాయి. విద్యా,వైద్యం,రవాణా తదితర శాఖలను ఎవరికి కేటాయిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు.

First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>