• HOME
 • »
 • NEWS
 • »
 • POLITICS
 • »
 • MAHARASHTRA POLLS 2019 GOVINDA CAMPAIGNS FOR BJP CANDIDATE IN BULDHANA

బీజేపీ అభ్యర్థి కోసం కాంగ్రెస్ మాజీ ఎంపీ, బాలీవుడ్ నటుడు ప్రచారం

బీజేపీ అభ్యర్థి కోసం కాంగ్రెస్ మాజీ ఎంపీ, బాలీవుడ్ నటుడు ప్రచారం

బీజేపీ అభ్యర్థి తరఫున బాలీవుడ్ నటుడు గోవింద ప్రచారం(Photo: ANI)

Maharashtra polls 2019 | మహారాష్ట్రలో ఈ సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారపర్వం ముగియనుంది. చివరి రోజైన శనివారం మల్కాపూర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి చైన్‌సుక్ మదన్‌లాల్‌ సన్‌చేటికి మద్దతుగా బాలీవుడ్ నటుడు గోవింద రోడ్ షో నిర్వహించారు. బీజేపీ కండువాను కప్పుకున్న గోవిందా...ఓపన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఓట్లు అభ్యర్థించారు.

 • Share this:
  మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ఈ సాయంత్రంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరిరోజున పలువురు జాతీయ నేతలు ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్రలోని బుల్‌దానాలో బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ గోవింద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మల్కాపూర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి చైన్‌సుక్ మదన్‌లాల్‌ సన్‌చేటికి మద్దతుగా ఆయన శనివారం రోడ్ షో నిర్వహించారు. బీజేపీ కండువాను కప్పుకున్న గోవిందా...ఓపన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదిలారు. గోవిందాను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఒకే విడతలో ఈ నెల 21న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు చేపట్లనున్నారు.

  ఇది కూడా చదవండి

  అలా చెప్పే దమ్ము మీకుందా?...కాంగ్రెస్‌కు అమిత్ షా సవాలు
  First published: