శివసేనకు ఎన్సీపీ మద్దతు..? బీజేపీకి బిగ్ షాక్ తప్పదా..?

బీజేపీ 50-50 ఫార్ములాకు అంగీకరించకుంటే ఎన్సీపీతో జతకట్టేందుకు శివసేన సిద్ధమవుతోంది. ఎన్సీసీ-కాంగ్రెస్ కూటమి అవసరమైతే శివసేనకు మద్దతిచ్చే అంశంపైనే పవార్, థాక్రే మధ్చ చర్చలు జరిగినిట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: November 1, 2019, 7:56 PM IST
శివసేనకు ఎన్సీపీ మద్దతు..? బీజేపీకి బిగ్ షాక్ తప్పదా..?
ఉధ్దవ్ థాక్రే, దేవేంద్ర ఫడ్నవిస్
  • Share this:
మహారాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. బీజేపీ-శివసేన మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా శివసేన కొత్త మిత్రులను వెతుకుతోంది. గురువారం రాత్రి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అదే సమయంలో శరద్ పవార్‌తో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య విభేదాల నేపథ్యంలో శివసేన-ఎన్సీపీ చర్చలు హాట్‌టాపిక్‌గా మారాయి.

288 అసెంబ్లీ సీట్లు మహారాష్ట్రలో బీజేపీ కూటమి 163 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 103 స్థానాలకే పరిమితమైంది. ఇతరులకు 22 స్థానాలు దక్కాయి. బీజేపీ కూటమిలో బీజేపీకి 105 సీట్లు రాగా..శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 50-50 ఫార్ములాకు అంగీకరించకుంటే ఎన్సీపీతో జతకట్టేందుకు శివసేన సిద్ధమవుతోంది. ఎన్సీసీ-కాంగ్రెస్ కూటమి అవసరమైతే శివసేనకు మద్దతిచ్చే అంశంపైనే పవార్, థాక్రే మధ్చ చర్చలు జరిగినిట్లు తెలుస్తోంది.

మరోవైపు సీఎం సీటు విషయంలో శివసేన వెనక్కి తగ్గడం లేదు. కొత్త ముఖ్యమంత్రి శివసేన పార్టీకి చెందిన నాయకుడే మహారాష్ట్రకు కొత్త సీఎం అవుతారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం ఉదయం ఓ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. తాము తలచుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. అందుకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతును సమకూర్చుకుంటామని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన,బీజేపీ మధ్య చర్చలు జరగలేదని వెల్లడించారు.

First published: November 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>