50-50 ఫార్ములా ముచ్చటే లేదు.. శివసేనకు అమిత్ షా కౌంటర్

కూటమి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీసే సీఎం అవుతారని.. ఎన్నికల ప్రచార సభల్లో చాలాసార్లు చెప్పానని గుర్తు చేశారు. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని.. ఇప్పుడేమో కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తున్నారని శివసేనకు కౌంటర్ ఇచ్చారు అమిత్ షా.

news18-telugu
Updated: November 13, 2019, 7:57 PM IST
50-50 ఫార్ములా ముచ్చటే లేదు.. శివసేనకు అమిత్ షా కౌంటర్
అమిత్ షా
  • Share this:
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభవ, శివసేన తెగదెంపులపై బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. తమ పాత మిత్రుడు శివసేనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 50-50 ఫార్ములా విషయంలో శివసేనకు తామెప్పుడూ హామీ ఇవ్వలేదని తెగేసి చెప్పారు అమిత్ షా. కూటమి గెలిస్తే దేవేంద్ర ఫడ్నవీసే సీఎం అవుతారని.. ఎన్నికల ప్రచార సభల్లో చాలాసార్లు చెప్పానని గుర్తు చేశారు. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని.. ఇప్పుడేమో కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తున్నారని శివసేనకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ చీఫ్.

ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఏర్పాటుకు ఇన్ని రోజులు సమయం ఇవ్వలేదు. మహారాష్ట్ర గవర్నర్ 18 రోజులు ఇచ్చారు. అసెంబ్లీ గడువు ముగిసిన తర్వాతే గవర్నర్ పార్టీలను ఆహ్వానించారు. బీజేపీతో పాటు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. ఎవరూ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేకపోయారు.
అమిత్ షా, బీజేపీ చీఫ్

ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశాన్ని ఏ పార్టీకి గవర్నర్ తిరస్కరించలేదన్నారు అమిత్ షా. కపిల్ సిబల్ లాంటి సీనియర్ లాయర్ ఆరోపణలు చిన్నపిల్లల వాదనల్లా ఉన్నాయని విమర్శించారు. సంఖ్యాబలం ఉన్న పార్టీలు ఇప్పుడు కూడా ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌ని వెళ్లి కలవచ్చని అభిప్రాయపడ్డారు బీజేపీ చీఫ్. ANI న్యూస్ ఏజెన్సీకి ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు అమిత్ షా.
First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...