బీజేపీకి షాక్.. మరాఠా సీఎం పీఠం తమదేనంటున్న శివసేన

శివసేన శాసనసభా పక్షనేతగా ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేను ఎన్నుకుంటారని.. పవర్ షేరింగ్‌కు బీజేపీ అంగీకరిస్తే శివసేన తరుపున ఆయన సీఎం అవుతారని ప్రచారం జరిగింది. వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ ఏక్‌నాథ్ షిండేను ఎన్నుకున్నారు.

news18-telugu
Updated: October 31, 2019, 3:39 PM IST
బీజేపీకి షాక్.. మరాఠా సీఎం పీఠం తమదేనంటున్న శివసేన
న్యూస్ 18 క్రియేటివ్
  • Share this:
మహారాష్ట్రలో మిత్రుల పోరు రోజురోజుకూ ముదురుతోంది. ఫలితాలు వెలువడి వారం రోజులవుతున్నా ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. శివసేన, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రమవుతోంది. గురువారం సమావేశమైన శివసేన పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఆదిత్య థాక్రేను కాకుండా ఏక్‌నాథ్ షిండేను ఎన్నుకున్నారు. షిండే పేరు ఆదిత్య థాక్రే ప్రతిపాదించగా శివసేన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అంతేకాదు తమకు మద్దతిచ్చేందుకు ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్నారు ఉద్ధవ్ థాక్రే. శిససేన పార్టీ నేతే సీఎం కాబోతున్నారని ఆ పార్టీ నేతలతో అన్నారు.

శివసేన శాసనసభా పక్షనేతగా ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేను ఎన్నుకుంటారని.. పవర్ షేరింగ్‌కు బీజేపీ అంగీకరిస్తే శివసేన తరుపున ఆయన సీఎం అవుతారని ప్రచారం జరిగింది. వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ ఏక్‌నాథ్ షిండేను ఎన్నుకున్నారు.

288 అసెంబ్లీ సీట్లు మహారాష్ట్రలో బీజేపీ కూటమి 163 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 103 స్థానాలకే పరిమితమైంది. ఇతరులకు 22 స్థానాలు దక్కాయి. బీజేపీ కూటమిలో బీజేపీకి 105 సీట్లు రాగా..శివసేన 56 స్థానాల్లో విజయం సాధించింది. ఐతే బీజేపీకి గతంలో పోల్చితే కొన్ని సీట్లు తగ్గితే.. శివసేన తన గ్రాఫ్‌ను పెంచుకుంది. ఈ క్రమంలో సీఎం పీఠంపై కన్నేసింది శివసేన. సీట్ల పంపకానికి ముందే 50-50 ఫార్ములాతో ఒప్పందం చేసుకున్నామని.. దాన్ని అమలు చేయాలని పట్టబట్టుతోంది. దీని ప్రకారం చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది.

First published: October 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>