శివసేనకు మరో షాక్.. బీజేపీతో టచ్‌లో 25 మంది ఎమ్మెల్యేలు..?

ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో అధికారం చేపట్టాలనుకున్న శివసేనకు.. గడువు పొడిగించలేమంటూ షాకిచ్చారు గవర్నర్ కోశ్యారీ. దాంతో మూడో అతి పెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన కోశ్యారీ.. మంగళవారం రాత్రి 08.30 వరకు సమయం ఇచ్చారు.

news18-telugu
Updated: November 11, 2019, 10:50 PM IST
శివసేనకు మరో షాక్.. బీజేపీతో టచ్‌లో 25 మంది ఎమ్మెల్యేలు..?
ఉధ్దవ్ థాక్రే, దేవేంద్ర ఫడ్నవిస్
• Share this:
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరాఠా రాజకీయాలు గంట గంటకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వ  ఏర్పాటుకు కొంత సమయం కావాలన్న శివసేన విజ్ఞప్తిని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తిరస్కరించి గట్టి షాకిచ్చారు. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీని ఆహ్వానించడంతో మరాఠా రాజకీయం సంచలన మలుపు తిరిగింది. ఈ క్రమంలో శివసేనకు మరో ఊహించని షాక్ తగలనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.  ఎన్సీపీ, కాంగ్రెస్‌తో శివసేనతో సంప్రదింపులు జరపడం, వారి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం.. శివసేన పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలకు నచ్చడం లేదట.

కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసే విషయంలో శివసేన ఎమ్మెల్యేల్లో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ థాక్రే నిర్ణయంపై పలువురు ఎమ్మెల్యేలే ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శివసేన పార్టీకి చెందిన సుమారు 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వారంతా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

#BREAKING
बीजेपी के संपर्क में शिवसेना के 25 विधायक, शिवसेना के विधायकों में
मतभेद की खबर@KishoreAjwanipic.twitter.com/HML8hIln1x

News18 India (@News18India) November
11, 2019

288 అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన 56 సీట్లు గెలిచింది. ఇక ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీ 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అది లేకే ప్రభుత్వ ఏర్పాటుపై చేతులెత్తేసింది కమలం పార్టీ.  ఇక ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో అధికారం చేపట్టాలనుకున్న శివసేనకు.. గడువు పొడిగించలేమంటూ షాకిచ్చారు గవర్నర్ కోశ్యారీ.   దాంతో మూడో అతి పెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. వారికి మంగళవారం రాత్రి 08.30 వరకు సమయం ఇచ్చారు.

First published: November 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading