మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.. శివసేనలో లుకలుకలు

పార్టీ సీనియర్ నేత మనోహర్ జోషితో కలిసి మాతోశ్రీకి వెళ్లారని, ఐతే వారికి ఉద్ధవ్ థాక్రే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది.

news18-telugu
Updated: November 20, 2019, 5:37 PM IST
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.. శివసేనలో లుకలుకలు
ఉద్ధవ్ థాక్రే
  • Share this:
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా పార్టీల పవర్ గేమ్ మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని.. శివసేరకు సీఎం పీఠంతో పాటు 16-15-12 ఫార్ములా ప్రకారం మంత్రి పదవులు పంచుకోబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల క్రమంలో వేళ మరాఠా రాజకీయాల్లో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో పొత్తుపై శివసేన పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

17 మంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీ చీప్ ఉద్ధవ్ థాక్రే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయమై ఉద్ధవ్‌తో చర్చించేందుకు వారు ప్రయత్నించినట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేత మనోహర్ జోషితో కలిసి మాతోశ్రీకి వెళ్లారని, ఐతే వారికి ఉద్ధవ్ థాక్రే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు బాలాసాహెబ్ తొరాట్, పృథ్విరాజ్ చౌహాన్, నజీమ్ ఖాన్ పార్టీ హైకమాండ్‌తో సమాలోచనలు చేస్తున్నారు. శివసేనతో కలిసి వెళ్లే అంశంపై కేసీ వేణుగోపాల్, మల్లిఖార్జున ఖర్గేతో చర్చించారు.
First published: November 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>