మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే.. వీడిన ఉత్కంఠ

మహారాష్ట్రకు కాబోయే సీఎం ఉద్ధవ్ థాక్రే అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించినట్లు తెలిపారు.

news18-telugu
Updated: November 22, 2019, 7:23 PM IST
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే.. వీడిన ఉత్కంఠ
ఉద్ధవ్ థాక్రే (ఫైల్ ఫొటో)
  • Share this:
నెల రోజులుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడింది. మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. శుక్రవారం సాయంత్రం ముంబైలో మూడు పార్టీల నేతలు సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. మహారాష్ట్రకు కాబోయే సీఎం ఉద్ధవ్ థాక్రే అని ప్రకటించారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించినట్లు తెలిపారు. ఈ ఒప్పందంపై మూడు పార్టీల ఎమ్మెల్యేలే సంతకాలు చేసినట్లు వెల్లడించారు పవార్. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి శనివారం మూడు పార్టీలు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనున్నాయి.

మహారాష్ట్రకు కాబోయే సీఎంగా ఉద్ధవ్ థాక్రేను మూడు పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ప్రభుత్వ ఏర్పాటుపై మరోసారి చర్చలు జరుగుతాయి. రేపు మూడు పార్టీల నేతలం కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం. గవర్నర్‌ను ఎప్పుడు కలవాలన్న దానిపై రేపు నిర్ణయం తీసుకుంటాం.
శరద్ పవార్


శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి మహారాష్ట్ర వికాస అఘాడ పేరుతో కూటమి ఏర్పాటు చేశారు. మూడు పార్టీల మధ్య సయోధ్య కుదిరిన నేపథ్యంలో త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. మరోవైపు శనివారం ఢిల్లీలో గవర్నర్స్ కాన్ఫరెన్స్‌కు హాజరుకావాల్సి ఉన్న మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. శనివారం ముంబైలోనే ఉండనున్నారు గవర్నర్. కాగా, అసెంబ్లీ సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన 56 సీట్లు గెలిచింది. ఇక ఎన్సీపీ 54, కాంగ్రెస్ పార్టీ 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 145 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. అధికారం విషయంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
First published: November 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>