మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. రాష్ట్రపతికి గవర్నర్ సిఫార్సు..

Maharashtra Politics : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాశారు.

news18-telugu
Updated: November 12, 2019, 1:39 PM IST
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. రాష్ట్రపతికి గవర్నర్ సిఫార్సు..
శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, ఫడ్నవీస్
  • Share this:
మహారాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఏ పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలన దిశగా ఆ రాష్ట్రం ముందుకు సాగుతోంది. తాజాగా.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతికి లేఖ రాశారు. నిన్న ఎన్సీపీ, కాంగ్రెస్ (బయటి నుంచీ మద్దతు)తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన శివసేనకు కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని త్వరగా చెప్పకపోవడంతో ఆశలు ఆవిరయ్యాయి. గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ ఇచ్చిన గడువు ముగియడం... మరికొంత సమయం కావాలని శివసేన అడిగిగా ఆయన ఒప్పుకోకుండా... ప్రభుత్వం ఏర్పాటు చెయ్యమని మూడో అతిపెద్ద పార్టీ ఎన్సీపీని ఆహ్వానించడం జరిగిపోయాయి. ఇక ఇవాళ రాత్రి 8.30 లోపు ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యగలగాలి. లేదంటే... నెక్ట్స్ ఛాన్స్ కాంగ్రెస్‌కు దక్కుతుంది. ఐతే... ఎన్సీపీ కూడా ముందుకు రాకపోవడంతో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేశారు.

బలాబలాలు చూస్తే : మొత్తం సీట్లు 288

బీజేపీ - 105
శివసేన - 56
ఎన్సీపీ - 54
కాంగ్రెస్ - 44
మజ్లిస్ - 2ఎస్పీ - 2
MNS - 1
CPM - 1
ఇతరులు - 23
Published by: Shravan Kumar Bommakanti
First published: November 12, 2019, 1:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading