మళ్లీ తెలంగాణ రాజకీయాల్లోకి... బీజేపీ సీనియర్ నేత క్లారిటీ

గతంలో పలుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా వ్యవహరించిన బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు... పొలిటికల్ రీ-ఎంట్రీ తరువాత పార్టీలో ఎలాంటి బాధ్యతలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: September 16, 2019, 6:08 PM IST
మళ్లీ తెలంగాణ రాజకీయాల్లోకి... బీజేపీ సీనియర్ నేత క్లారిటీ
బీజేపీ జెండా
  • Share this:
మహారాష్ట్ర గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు మళ్లీ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్‌గా పదవీ విరమణ చేసిన తరువాత విద్యాసాగర్ రావు మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో ఉంటారా లేదా అనే అంశంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టారు. పార్టీ అధిష్టానం ఆదేశాలు మేరకు తాను పని చేస్తానని ఆయన వివరించారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తానని విద్యాసాగర్ రావు వివరణ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు.

గతంలో పలుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా వ్యవహరించిన విద్యాసాగర్ రావు... పొలిటికల్ రీ-ఎంట్రీ నేపథ్యంలో ఎలాంటి బాధ్యతలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది చివర్లో తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించనుండటంతో... ఆ రేసులో విద్యాసాగర్ రావు కూడా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ సామాజికవర్గానికి చెందిన విద్యాసాగర్ రావుకు ఉత్తర తెలంగాణ రాజకీయాలపై మంచి పట్టున్న నేపథ్యంలో... ఆయనకు బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించే అవకాశాలు లేకపోలేదనే వార్తలు వినిపించాయి. మొత్తానికి మరోసారి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్న విద్యాసాగర్ రావుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>