ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు... యువతకు బీజేపీ హామీ

వచ్చే ఐదేళ్లలో మౌలిక వసతుల కోసం రూ.5 లక్షల కోట్లను ఖర్చు చేస్తామని చెప్పారు. అంతేకాదు వినోద్ దామోదర్ సర్కార్‌కు భారత రత్న వచ్చేలా కృషి చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు.

news18-telugu
Updated: October 15, 2019, 4:57 PM IST
ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు... యువతకు బీజేపీ హామీ
బీజేపీ మెనిఫెస్టో విడుదల
  • Share this:
మరాఠా యుద్థంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచార పర్వం తారాస్థాయికి చేరింది. బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సహా పార్టీలన్నీ ప్రజలకు హామీల జల్లు కురిపిస్తూ ఓట్ల గాలం వేస్తున్నాయి. మంగళవారం మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ యువతను ఆకట్టుకునేందుకు ఉద్యోగాల హామీని ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను భర్తీ చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో 30వేల కి.మీ. మేర రోడ్లను నిర్మిస్తామని, పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

ముంబైలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, ముంబై యూనిట్ హెడ్ మంగళ్ ప్రభాత్ లోదా.. బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మరఠ్వాడా ప్రాంతానికి తాగు, సాగు నీరందించేందుకు పలు ప్రాజెక్టులను అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో మౌలిక వసతుల కోసం రూ.5 లక్షల కోట్లను ఖర్చు చేస్తామని చెప్పారు. అంతేకాదు వినోద్ దామోదర్ సర్కార్‌కు భారత రత్న వచ్చేలా కృషి చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు.

కాగా, 228 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి అక్టోబరు 21న ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలను వెల్లడిస్తారు. మరో వారం రోజులే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు