news18-telugu
Updated: October 24, 2019, 11:41 AM IST
బీజేపీ జెండా
మహారాష్ట్రలో అధికార బీజేపీ మరోసారి తన పట్టు నిలబెట్టుకుంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం.. 103కు సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు బీజేపీ మిత్రపక్షం శివసేన 60 సీట్లలో ముందంజలో ఉంది. ఎన్సీపీ 52, కాంగ్రెస్ 41, స్వతంత్ర అభ్యర్థులు 15 మంది లీడింగ్‌లో ఉన్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్నాయి. 145 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. బీజేపీ - శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమే. అయితే, తమకు సీఎం పీఠం కావాలని శివసేన డిమాండ్ చేస్తోంది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 24, 2019, 11:34 AM IST