MAHARASHTRA CM DEVENDRA FADNAVIS TRAILS WHO WILL BE THE NEXT CM BS
Maharashtra Election Results: ఫడ్నవీస్‌తో మెజారిటీ దోబూచులాట.. మహారాష్ట్ర నెక్ట్స్ సీఎం ఎవరు..
దేవేంద్ర ఫడ్నవీస్ (ఫైల్)
Maharashtra Election Results 2019 : నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఫడ్నవీస్‌తో ఓట్లు దోబూచులాడుతున్నాయి. ఓ రౌండ్లో ఫడ్నవీస్ వెనుకంజ వేయడంతో మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా ఎవర్ని ఎంపిక చేస్తారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.
మహారాష్ట్రలో బీజేపీ కూటమి దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఆ కూటమి అధికారం చేపట్టే దిశగా ముందుకు సాగుతోంది. అయితే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ఓ సందర్భంలో వెనుకంజలో, మరో సందర్భంలో ముందంజలో కొనసాగుతున్నారు. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయనతో ఓట్లు దోబూచులాడుతున్నాయి. ఓ రౌండ్లో ఫడ్నవీస్ వెనుకంజ వేయడంతో మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా ఎవర్ని ఎంపిక చేస్తారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఒక వేళ ఫడ్నవీస్ ఓడిపోతే ఎవరు సీఎం పీఠం ఎక్కుతారంటూ అప్పుడే చర్చలు మొదలయ్యాయి. కాగా, వర్లీ నుంచి శివసేన అభ్యర్థి ఆదిత్య థాక్రే ముందంజలో ఉన్నారు. పర్లీ నుంచి పంకజ్ ముండే వెనుకంజలో ఉన్నారు.
ఇదిలా ఉండగా, బీజేపీ కూటమి మహారాష్ట్రలో 200 సీట్లలో పాగా వేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినట్టుగానే... ఈ సారి కూడా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి భారీ పరాజయాన్ని మూటగట్టుకునేలా ఉంది. ఇక హర్యానాలోనూ బీజేపీ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.