అలా చెప్పే దమ్ము మీకుందా?...కాంగ్రెస్‌కు అమిత్ షా సవాలు

Maharashtra Assembly Election: తాను అధికారంలోకి వస్తే జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పగలదా? అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సవాలు చేశారు.

news18-telugu
Updated: October 19, 2019, 4:12 PM IST
అలా చెప్పే దమ్ము మీకుందా?...కాంగ్రెస్‌కు అమిత్ షా సవాలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
  • Share this:
జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమర్థించుకున్నారు. మహారాష్ట్రలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా...అక్కడ ప్రచార పర్వం ఈ సాయంత్రం ముగియనుంది. ఈ నేపథ్యంలో నవపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన అమిత్ షా...కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని తప్పుబడుతున్న కాంగ్రెస్ పార్టీ...తాను అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెప్పగలదా? అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల్లో 40 వేల మంది చనిపోయినా...ఆర్టికల్ 370ని ఆ పార్టీ రద్దు చేయలేదని విమర్శించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇక ఒక రోజే ఉంది. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నా. మేము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ప్రకటించే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా?. జమ్ముకశ్మీర్‌లో భారత జవాన్ల మరణాలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎందుకు మౌనంవీడలేదు.
అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి


అత్యధిక సంఖ్యలో గిరిజన, ఓబీసీ ప్రజాప్రతినిధులు బీజేపీలోనే ఉన్నారని గుర్తుచేశారు. హామీలు ఇవ్వడం తప్ప గిరిజనులు, ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. గిరిజనుల సంక్షేమానికి బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 21న ఒకే విడతలో నిర్వహించనుండగా...24న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
First published: October 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు