మహాకూటమి పేరు మార్పు.. ఇకపై తెలంగాణ పరిరక్షణ వేదిక‌..!

గతంలో మహాకూటమి పేరుతో కొన్ని పార్టీలు జట్టుకట్టాయి. దీంతో ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు పేరు మార్చాలని నిర్ణయించారు.


Updated: October 3, 2018, 6:35 PM IST
మహాకూటమి పేరు మార్పు.. ఇకపై తెలంగాణ పరిరక్షణ వేదిక‌..!
కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల సమావేశం (File)
  • Share this:
తెలంగాణలో మహాకూటమి పేరును మార్చారు. కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి కలసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైన వేళ.. మహాకూటమి పేరును ‘తెలంగాణ పరిరక్షణ వేదిక’గా మార్చినట్టు తెలుస్తోంది. మరోపేరును కూడా పరిశీలిస్తున్నారు. కూటమికి కోదండరాం‌ను చైర్మన్‌గా ఉండాలని నేతలు నిర్ణయించారు. గతంలో కూడా మహాకూటమి పేరు మీద కొన్ని పార్టీలు కలసి పనిచేశాయి. దీంతో కొత్త రాష్ట్రంలో కొంచెం కొత్తగా ఉండాలనే అభిప్రాయంతో పాటు.. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో నేతలు కొత్తపేరును ఎంపికచేశారు. దీంతోపాటు సమావేశంలో కామన్ మినిమమ్ ప్రోగ్రా మీద చర్చించారు. గత వారం రోజుల్లో కూటమి నేతలు మూడుసార్లు సమావేశం అయ్యారు. కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, టీజేఎస్ నుంచి దిలీప్ కుమార్ ఈ భేటీకి హాజరయ్యారు.

ప్రధానంగా మూడు అంశాల మీద చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఆయా పార్టీల మేనిఫెస్టోను క్రోడీకరించి ఉమ్మడి ప్రణాళికను ఎప్పటిలోగా రూపొందించాలని చర్చించారు. అన్ని పార్టీల మేనిఫెస్టోలో ఉమ్మడిగా ఉన్న అంశాలను తీసుకోనున్నారు. సీట్ల సర్దుబాటు మీద ఈ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే వాటి మీద క్లారిటీ రానుంది. ఉమ్మడి ప్రణాళికను కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

గురువారం అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించనుంది. ప్రచార షెడ్యూల్‌ను కూడా అప్పుడే ప్రకటిస్తామని టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క తెలిపారు. ఉమ్మడి ప్రణాళిక మీద మరికొంత చర్చ జరగాల్సి ఉందని.. ఆ తర్వాత ప్రకటిస్తామన్నారు.

ఇవి కూడా చదవండి
Published by: Ashok Kumar Bonepalli
First published: October 3, 2018, 4:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading