టీడీపీకి మాగుంట శ్రీనివాసులరెడ్డి గుడ్‌బై.. త్వరలో వైసీపీలోకి

మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అక్కడ వైవీ సుబ్బారెడ్డిని తప్పిస్తారని టాక్ నడుస్తోంది.

news18-telugu
Updated: March 14, 2019, 5:25 PM IST
టీడీపీకి మాగుంట శ్రీనివాసులరెడ్డి గుడ్‌బై.. త్వరలో వైసీపీలోకి
మాగుంట శ్రీనివాసులురెడ్డి(Image Facebook)
  • Share this:
టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీని వీడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పుడు అధికారికంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు రాజీనామా లేఖను పంపారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్ష పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామ చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో వైసీపీలో చేరతానని ప్రకటించారు. వైసీపీ తరఫున ఆయన ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అక్కడ సిట్టింగ్ ఎంపీ, జగన్‌మోహన్ రెడ్డికి బాబాయి అయిన వైవీ సుబ్బారెడ్డిని తప్పించి ఆయన స్థానంలో మాగుంటను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. మాగుంట శ్రీనివాసులురెడ్డి ఎప్పటి నుంచో పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబును కలిశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌‌తో కూడా భేటీ అయ్యారు. చివరకు టీడీపీని వీడుతున్నట్టు స్పష్టం చేశారు.
First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading