టార్గెట్ ఆర్ఎస్ఎస్...గాడ్సే, ప్రజ్ఞా ఠాగూర్‌‌పై అజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు

గాడ్సే, ప్రజ్ఞా సింగ్‌లాంటి వ్యక్తులను మదర్సాలు ఉత్పత్తి చేయవని అజమ్ ఖాన్ వ్యాఖ్యానించారు. మదర్సాల ప్రమాణాలను పెంపొందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే..ముందుగా తన ప్రమాణాలు పెంచుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు.

news18-telugu
Updated: June 12, 2019, 12:00 PM IST
టార్గెట్ ఆర్ఎస్ఎస్...గాడ్సే, ప్రజ్ఞా ఠాగూర్‌‌పై అజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు
అజం ఖాన్ (File)
  • Share this:
సమాజ్‌వాది ఎంపీ అజమ్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పరోక్షంగా ఆర్ఎస్ఎస్‌ను ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీ హంతకుడు నాధురాం గాడ్సే, మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాగూర్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గాడ్సే, ప్రజ్ఞా సింగ్‌లాంటి వ్యక్తులను మదర్సాలు ఉత్పత్తి చేయవని ఆయన వ్యాఖ్యానించారు. మదర్సాలలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర నిర్ణయించడంపై స్పందిస్తూ ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గాడ్సే సిద్ధాంతాలను వ్యాపింపజేసే వారిని ప్రజాస్వామ్య శత్రువులుగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్న వారికి రివార్డులు ఇవ్వడం మానుకోవాలన్నారు. మదర్సాల ప్రమాణాలను పెంపొందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే..ముందుగా తన ప్రమాణాలు పెంచుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. మదర్సాలలో మతబోధనలతో పాటు ఇంగ్లీష్, హిందీ, గణితం కూడా నేర్పుతున్నారని గుర్తుచేశారు. మదర్సాల నాణ్యత పెంచాలని భావిస్తే వాటికి మంచి భవనాలు నిర్మించాలని, ఫర్నిచర్ వంటి ఇతర మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన వసతిని కల్పించాలని సూచించారు.
Published by: Janardhan V
First published: June 12, 2019, 11:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading