Home /News /politics /

Rs 100 for Selfie: రూ.100 చెల్లిస్తేనే సెల్ఫీ ఇస్తా.. పార్టీ కార్యకర్తలకు కండిషన్ పెట్టిన మంత్రి

Rs 100 for Selfie: రూ.100 చెల్లిస్తేనే సెల్ఫీ ఇస్తా.. పార్టీ కార్యకర్తలకు కండిషన్ పెట్టిన మంత్రి

ఉషా ఠాకూర్

ఉషా ఠాకూర్

ఇటీవల వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఉషా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. రెండు డోసుల టీకా తీసుకున్న వారంతా పీఎం కేర్స్‌కు రూ.500 విరాళం ఇవ్వాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

    మన ప్రాంతానికి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా.. లేదంటే ఏదైనా రాజకీయ కార్యక్రమానికి జనాలు వెళ్లినా.. అక్కడ నేతలతో ఫొటోలు దిగేందుకు కార్యకర్తలు ఎగబడుతుంటారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే.. సార్ ఒక్క సెల్ఫీ.. మేడమ్ ఒకే ఒక్క ఫొటో అని రిక్వెస్ట్ చేస్తుంటారు. మధ్యప్రదేశ్ మంత్రి ఉషా ఠకూర్‌కు కూడా చాలా చోట్ల ఇదే అనుభవం ఎదురవుతోంది. ఎక్కడి వెళ్లినా సెల్ఫీల కోసం కార్యకర్తలు, అభిమానులు ఎగబడుతున్నారు. మంత్రి స్థానంలో ఉన్న ఆమెకు ఎన్నో పనులు ఉంటాయి. వాటన్నింటినీ పక్కనబెట్టి కార్యకర్తలకు సెల్ఫీ ఇవ్వడం ఆమెకు నచ్చడం లేదు. అందుకే ఉషా ఠాకూర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. తనతో సెల్ఫీలు దిగేందుకు వచ్చేవారికి కండిషన్ పెట్టారు. పార్టీ యూనిట్‌కు రూ.100 విరాళం ఇస్తేనే.. తాను సెల్ఫీ ఇస్తానని స్పష్టం చేశారు. శనివారం ఖండ్వాలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


    ''మిత్రులారా మీ అందరికి తెలుసు. సెల్ఫీలు ఇవ్వడం వల్ల చాలా సమయం వృథా అవుతుంది. ఒక్కోసారి గంటల కొద్దీ ఆలస్యం అవుతుంది. అందుకే పార్టీ కోసం ఓ నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే సెల్ఫీ తీసుకునేందుకు వస్తారో వారు స్థానిక పార్టీ కోశాధికారికి రూ.100 జమచేయాలి. అలా సమకూరిన డబ్బును పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకోవచ్చు.'' అని ఉషా ఠాకూర్ పేర్కొన్నారు.

    అంతేకాదు బహిరంగ కార్యక్రమాలకు ఆహ్వానించేవారు బొకేలకు బదులు పుస్తకాలు ఇవ్వాలని కోరారు. అలా వచ్చిన పుస్తకాలతో పార్టీ కార్యాలయంలో లైబ్రరీని ఏర్పాటు చేయవచ్చని ఉషా ఠాకూర్ అన్నారు. పువ్వులతో స్వాగతం తీసుకునే వారిలో లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని.. మనందరి పాపాలను తొలగించే మచ్చలేని విష్ణువు తప్ప మరెవ్వరూ పువ్వులు అంగీకరించలేరని ఆమె అభిప్రాయపడ్డారు. కాబట్టి, తాను పువ్వులను అంగీకరించనని ఉషా ఠాకూర్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫ్లవర్ బొకేలకు బదులుగా పుస్తకాలు ఇవ్వాలని సూచించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలా సేకరించిన పుస్తకాలు ఎంతో మంది జ్ఞానం అందజేస్తాయని ఆమె చెప్పారు.

    ఇక ఇటీవల వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఉషా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. రెండు డోసుల టీకా తీసుకున్న వారంతా పీఎం కేర్స్‌కు రూ.500 విరాళం ఇవ్వాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Madhya pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు