నేడు బలపరీక్ష నిర్వహించాల్సిందే.. లేకపోతే.. మధ్యప్రదేశ్ గవర్నర్ హెచ్చరిక..

గవర్నర్.. కమల్‌నాథ్ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. మంగళవారం నాడు బలపరీక్ష నిరూపించుకోవాలని, లేనిపక్షంలో మెజారిటీ లేదని నిర్ణయానికి రావాల్సి వస్తుందని హెచ్చరించారు.

news18-telugu
Updated: March 17, 2020, 7:11 AM IST
నేడు బలపరీక్ష నిర్వహించాల్సిందే.. లేకపోతే.. మధ్యప్రదేశ్ గవర్నర్ హెచ్చరిక..
కమల్‌నాథ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
మధ్యప్రదేశ్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది మొదలు.. అసెంబ్లీ పరిణామాలు, గవర్నర్ ఆదేశాలు, స్పీకర్ నిర్ణయాలు.. ప్రతీది ఆసక్తిగా మారింది. బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ ఆదేశిస్తే.. కరోనా ప్రభావం ఉందని స్పీకర్ అసెంబ్లీని ఈ నెల 26 వరకు వాయిదా వేశారు. అటు.. తమకు పూర్తి మెజారిటీ ఉందని కమల్‌నాథ్ సర్కారు చెబుతోంది. అయితే, స్పీకర్ నిర్ణయంతో నొచ్చుకున్న గవర్నర్.. కమల్‌నాథ్ సర్కారుకు అల్టిమేటం జారీ చేశారు. మంగళవారం నాడు బలపరీక్ష నిరూపించుకోవాలని, లేనిపక్షంలో మెజారిటీ లేదని నిర్ణయానికి రావాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో ఈ రోజు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది.


అటు.. జైపూర్‌కు తరలించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీ ప్రారంభానికి ముందే భోపాల్‌కు రప్పించారు. వారందర్ని భోపాల్‌లోని మారియట్‌ హోటల్‌కు తరలించారు. విప్ జారీ చేస్తూ ఏప్రిల్ 13 వరకు నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. ఇదిలా ఉండగా, విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉండాలంటూ బీజేపీ కూడా తన ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసింది. బలపరీక్షపై ఢిల్లీలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నివాసంలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌, జ్యోతిరాదిత్య సింధియా భేటీ అయ్యారు. బెంగళూరులో ఉన్న 22 మంది కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు సైతం భోపాల్‌కు చేరుకున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 17, 2020, 7:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading