మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ : కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ

Madhya Pradesh Exit Polls: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రిజల్ట్స్ ఆధారంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య విజయావకాశాలు ఫిఫ్టీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

news18-telugu
Updated: December 7, 2018, 6:37 PM IST
మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్ : కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ
Madhya Pradesh Exit Polls:madhya-pradesh-exit-polls|మధ్యప్రదేశ్ ఎగ్జిట్‌పోల్స్ .. కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ
news18-telugu
Updated: December 7, 2018, 6:37 PM IST
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్‌కు సంబంధించి తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పలు సంస్థలు విడుదల చేసిన ఫలితాలు..కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటాపోటీ ఉండబోతోందని స్పష్టం చేస్తున్నాయి. ఇండియా టుడే విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం.. బీజేపీ 102 నుంచి 120 స్థానాలను, కాంగ్రెస్ 104 నుంచి 122 గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇతరులు 4నుంచి 11 స్థానాలు దక్కించుకోనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన బీఎస్పీ ఖాతా తెరిచే అవకాశాలు లేవని ఈ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.

టైమ్స్ నౌ సీఎన్ఎక్స్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం.. బీజేపీ 126 స్థానాలు, కాంగ్రెస్ 89 స్థానాలు, బీఎస్పీ 6 స్థానాలు గెలువనుండగా.. ఇతరులు 9 స్థానాలు దక్కించుకోనున్నారు. రిపబ్లిక్ టీవీ, జన్ కబీ బాత్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే.. అధికార బీజేపీ 108 నుంచి 128 స్థానాలు, కాంగ్రెస్ 95 నుంచి 115 స్థానాలు, ఇతరులు 7 స్థానాలు గెలవబోతున్నట్టుగా స్పష్టమవుతోంది. న్యూస్ ఎక్స్-నేత రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ 106, కాంగ్రెస్ 112, ఇతరులు 6 నుంచి 12 స్థానాలు దక్కించుకోనున్నట్టు తెలుస్తోంది.
మరో సర్వే సంస్థ ఇండియా టుడే యాక్సిస్ నిర్వహించిన విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో.. బీజేపీ 102 నుంచి 120 స్థానాలు, కాంగ్రెస్ 104 నుంచి 122 స్థానాలు, ఇతరులు 4 నుంచి 11 స్థానాలు దక్కించుకోనున్నట్టు స్పష్టమవుతోంది.


Loading...సర్వే సంస్థకాంగ్రెస్ బీజేపీ ఇతరులు
ఇండియాటుడే - యాక్సిస్ 104 - 122 102 - 120 04 - 11
రిపబ్లిక్ - సీ ఓటర్ 95 - 115 110 - 126 06 - 22
న్యూస్ ఎక్స్ - నేత 112 106 12
టైమ్స్ నౌ- సీఎన్‌ఎక్స్ 89 126 09
రిపబ్లిక్ టీవీ - జన్‌కీ బాత్ 95-115 108-128 7

 
First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...