మోదీతో టచ్‌లో సింధియా? మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలిపోనుందా..

ప్రధాని మోదీతో జ్యోతిరాదిత్య సింధియా టచ్‌లో ఉన్నారని.. తన వర్గంఎ మ్మెల్యేలతో కలిసి ఆయన త్వరలోనే బీజేపీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: March 9, 2020, 10:42 PM IST
మోదీతో టచ్‌లో సింధియా? మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలిపోనుందా..
జ్యోతిరాదిత్య సింధియా
  • Share this:
మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో సంక్షోభం నెలకొంది. సీఎం కమల్‌నాథ్, కాంగ్రెస్ యువ నేత జ్యోతరాదిత్య సింధియా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జ్యోతరాదిత్య వర్గానికి చెందిన ఆరుగురు మంత్రులు సహా మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులోని రిసార్ట్‌కు వెళ్లడం.. మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. వారితో పాటు జ్యోతిరాదిత్య సింధియా కూడా తన ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన అందుబాటులోకి రాలేదు. ఐతే ప్రధాని మోదీతో జ్యోతిరాదిత్య సింధియా టచ్‌లో ఉన్నారని.. తన వర్గంఎ మ్మెల్యేలతో కలిసి ఆయన త్వరలోనే బీజేపీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సింధియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి. ఫోన్లు స్విచాఫ్ చేసిన వారిలో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి తులసి సిలావత్, కార్మికశాఖ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా, రవాణా మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్, మహిళా-శిశు అభివృద్ధి మంత్రి ఇమార్తి దేవి, ఆహారం-పౌరసరఫరాల మంత్రి ప్రద్యుమ్న సింగ్ తమర్, పాఠశాల విద్యమంత్రి ప్రభుర చౌదరి ఉన్నారు.

230 సీట్లున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 107 మంది సభ్యుల బలం ఉంది. ఇక నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్సీ సభ్యులు, ఒక సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించడంతో.. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఐతే జ్యోతిరాదిత్య వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు అసమ్మతితో ఉన్నారని.. కమల్‌నాథ్ ప్రభుత్వానికి మెజార్టీ లేదని బీజేపీ విమర్శిస్తోంది. అంతేకాదు వీలైనంత త్వరలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: March 9, 2020, 10:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading