Madhya Pradesh: బలపరీక్షకు ముందే మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ రాజీనామా

CM Kamal nath resigns: మరికొద్దిసేపట్లో అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొవాల్సిన సీఎం కమల్ నాథ్... అంతకు కొన్ని గంటల ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

news18-telugu
Updated: March 20, 2020, 12:57 PM IST
Madhya Pradesh: బలపరీక్షకు ముందే మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ రాజీనామా
మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్(File)
  • Share this:
మధ్యప్రదేశ్‌లో సస్పెన్స్‌కు తెరపడింది. మరికొద్దిసేపట్లో అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొవాల్సిన సీఎం కమల్ నాథ్... అంతకు కొన్ని గంటల ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సమావేశంలో బీజేపీపై విమర్శలు గుప్పించిన కమల్ నాథ్... వ్యాపారంతో కూడిన రాజకీయాల్లో తాను ఎప్పుడు భాగస్వామిని కాలేనని ఆయన వ్యాఖ్యానించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరూ తనను వేలెత్తి చూపలేరని కమల్ నాథ్ అన్నారు. తనకు ప్రజల ఇచ్చిన సర్టిఫికెట్ ఉందని... ఇతరులు ఇచ్చే సర్టిఫికెట్ అవసరం లేదని తెలిపారు. బీజేపీ రాష్ట్రాన్ని కానీ, తన ఆత్మస్థైర్యాన్ని కానీ దెబ్బతీయలేదని అన్నారు. తాను తన రాజకీయ జీవితంలో విలువలతో కూడిన రాజకీయాలే చేశానని అన్నారు. గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖ ఇవ్వబోతున్నట్టు తెలిపారు.

మొత్తం 230 సభ్యులు ఉండే మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రస్తుతం 228 మంది సభ్యులు ఉన్నారు. 16 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో 108గా ఉన్న కాంగ్రెస్ బలం 92కు పడిపోయింది. అంతకుముందు ఆరుగురు మంత్రులు రాజీనామా చేశారు. 22 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీపై తిరుగుబాటు చేయడంతో... ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అష్టకష్టాలు పడుతోంది. బీజేపీకి సభలో 107 మంది బలం ఉంది. ఈ తరుణంలో జరగబోయే బలపరీక్షలో కమల్ నాథ్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ముగ్గురు బీస్పీ, ఎస్పీ సభ్యులు కూడా బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ఇదివరకే ప్రకటించారు. దీంతో ప్రభుత్వం గట్టెక్కే పరిస్థితి లేకపోవడం వల్లే కమల్ నాథ్ బలపరీక్షకు ముందు రాజీనామాకు సిద్దపడ్డారని తెలుస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: March 20, 2020, 12:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading