మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారుకు ఊరట.. బీజేపీకి ఝలక్ ఇచ్చిన స్పీకర్..

మధ్యప్రదేశ్‌లో పొలిటికల్ హైడ్రామా మరో దిశకు తిరిగింది. 26వ తేదీకి బలపరీక్షను వాయిదా వేస్తూ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

news18-telugu
Updated: March 16, 2020, 12:33 PM IST
మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కారుకు ఊరట.. బీజేపీకి ఝలక్ ఇచ్చిన స్పీకర్..
కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా
  • Share this:
మధ్యప్రదేశ్‌లో పొలిటికల్ హైడ్రామా మరో దిశకు తిరిగింది. గత కొన్ని రోజులుగా ఆసక్తి రేపుతున్న ఆ రాష్ట్ర రాజకీయాలు మరింత రంజుగా మారాయి. కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలోకి జంప్ కావడంతో పాటు 17 మంది ఎమ్మెల్యేలను తన వెంట తీసుకెళ్లేందుకు రెడీ అయిన నేపథ్యంలో కమల్‌నాథ్ సర్కారు బలపరీక్షకు సిద్ధమైంది. సోమవారమే బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ స్పీకర్‌ను ఆదేశించారు కూడా. సోమవారం ఉదయం 11 గంటలకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుందని, తన ప్రసంగం ముగిసిన వెంటనే విశ్వాస పరీక్ష నిర్వహించాలని గవర్నర్​ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ.. స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 26వ తేదీకి బలపరీక్షను వాయిదా వేస్తూ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన స్పీకర్.. బలపరీక్ష ఉంటే సభలో తన పాత్రపై అప్పుడే నిర్ణయం తీసుకుంటానని చెప్పడం గమనార్హం. అంతా అనుకున్నట్లుగానే స్పీకర్ సభను వాయిదా వేయడంతో బలపరీక్ష వాయిదా పడ్డట్లు అయ్యింది.

ఇదిలా ఉండగా, జైపూర్‌కు తరలించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరినీ భోపాల్‌కు రప్పించారు. వారందర్ని భోపాల్‌లోని మారియట్‌ హోటల్‌కు తరలించారు. విప్ జారీ చేస్తూ ఏప్రిల్ 13 వరకు నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది. విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉండాలంటూ బీజేపీ కూడా తన ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసింది. బలపరీక్షపై ఢిల్లీలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ నివాసంలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌, జ్యోతిరాదిత్య సింధియా భేటీ అయ్యారు. బెంగళూరులో ఉన్న 22 మంది కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు సైతం భోపాల్‌కు చేరుకున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: March 16, 2020, 12:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading