MAA Elections: 'మా' ఎన్నికల్లో చక్రం తిప్పిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే...ఆ ప్యానెల్‌కు మద్దతు.. ఓటర్లకు పట్టు చీరలు

'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ప్యానల్‌ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రకాశ్‌ రాజ్‌, తన సమక్షంలోనే ఎన్నికల అధికారి పోస్టల్ బ్యాలెట్లు ఓపెన్ చేయించారని.. అందులో మూడో వ్యక్తి ప్రవేశించలేదన్నారు మంచు విష్ణు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇలాంటి విమర్శలు అన్నీ తనకు వినిపిస్తున్నాయని చెప్పాడు ఈయన.

MAA elections: మా ఎన్నికకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మా ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చక్రం తిప్పారని, మంచు విష్ణు ప్యానెల్ పూర్తి సహాయ సహకారాలు అందించారని తెలుస్తోంది.

 • Share this:
  గత వారం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు (MAA Elections) తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తెలిసిందే. నోటిఫికేషన్ రాక ముందు నుంచే ఈ ఎన్నికలపై రచ్చ జరిగింది. చివరకు పోలింగ్ రోజు కూడా నానా రభస చోటు చేసుకుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. మంచు విష్ణు (Manchu Vishnu), ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్యానెళ్లు నువ్వా.. నేనా.. అన్నట్లుగా తలపడ్డాయి. చివరకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు భారీ మెజారిటీతో గెలిచారు. విజయంపై మొదటి నుంచీ ప్రకాశ్ రాజ్ ధీమాగా ఉన్నా.. ఆయన అంచనాలు తప్పాయి. మా ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం పెరిగిందని.. ఓటర్లకు డబ్బులు పంచి, పార్టీలు నిర్వహించి ప్రలోభాలకు గురిచేశారని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మా ఎన్నికకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మా ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే (TRS MLA) జోక్యం చేసుకున్నారని, మంచు విష్ణు ప్యానెల్ పూర్తి సహాయ సహకారాలు అందించారని తెలుస్తోంది. అంతేకాదు మాలో సభ్యత్వం ఉన్న జూనియర్ ఆర్టిస్టులకు పట్టుచీరలు పంచారని దక్కన్ క్రానికల్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

  ‘పెళ్లి సందD’ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్ తేడాగా ఉన్నా రోషన్ కుమ్మేసాడు..!

  ఆయన ఎవరో కాదు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy). ఈయన సినిమాలకు ఫైనాన్షియర్‌గా వ్యవహరిస్తుంటారు. అంతేకాదు ఎంతో మంది నటీనటుల, దర్శకులు, నిర్మాతలతో ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే ఆయన మా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని తెలుస్తోంది. మంచు విష్ణు ప్యానెల్ తరపున రంగంలోకి దిగి.. ఆయన విజయం కోసం తెర వెనక చక్రం తిప్పినట్లుగా సమాచారం. మా ఎన్నికల ఫలితాల తర్వాతే జీవన్ రెడ్డి జోక్యం గురించి టీఆర్ఎస్ హైకమాండ్‌కు తెలిసిందట. ఈ నేపథ్యంలో మా ఎన్నికలపై జీవన్ రెడ్డి ప్రత్యేక ఆసక్తి కనబరచడానికి కారణమేంటన్న దానిపై పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

  టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి


  యాంకర్ రవి ఖాతాలో మరొకరు బలి.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..?

  కాగా, అక్టోబరు 10న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మా అధ్యక్షుడిగా ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు.  ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరపున కూడా కొందరు గెలిచారు. కానీ వారంతా రాజీనామా చేశారు. కొత్త కార్యవర్గం ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకోవాలనే ఉద్దేశంతోనే తాము రాజీనామాచేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో మోహన్ బాబును టార్గెట్ చేసుకొని ప్రకాశ్ రాజ్ వర్గం తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల రోజు తమ టీమ్ మెంబర్స్‌ను అసభ్య పదజాలంతో దూషించారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఆ రోజు జరిగిన పరిణామాలను తలచుకొని బెనర్జీ, తనీష్ కంటతడిపెట్టారు.

  సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్ బిల్ ఎంత.. 35 రోజులకు అపోలో ఎంత తీసుకుంది..

  ఇక ఈ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రకాశ్ రాజ్ వర్గ తీవ్రంగా విమర్శిస్తోంది. బ్యాలెట్ పత్రాలు ఇంటికి తీసుకెళ్లారని, రాత్రి గెలిచిన వాళ్లు ఉదయానికి ఎలా ఓడిపోతున్నారని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ రోజు పోలింగ్ కేంద్రంలో జరిగిన రచ్చ గురించి ప్రజలందరికీ తెలియాలని, సీసీ ఫుటేజీ ఇవ్వాలని ఎన్నికల అధికారులను ప్రకాశ్ రాజ్ కోరారు. అంతేకాదు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కోర్టును ఆశ్రయించబోతున్నట్లు తెలుస్తోంది.
  Published by:Shiva Kumar Addula
  First published: