AP Elections 2019: జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఎల్వీ.. అత్యవసర అంశాలు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా ఈ నెల 30న ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని జగన్ సూచించినట్లు తెలిసింది.
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. వారంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నెల 30న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఉంటారన్నది కీలకం కానుంది. ప్రస్తుతం సీఎస్‌గా కొనసాగుతున్న ఎల్వీ సుబ్రమణ్యంనే కొనసాగించే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ప్రభుత్వ సలహాదారుగా అజయ్ కల్లాంను నియమించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని గురువారం తనను కలిసిన ఎల్వీ సుబ్రమణ్యంతో జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ‘జగన్‌తో భేటీ సందర్భంగా తనను సీఎస్‌గా ఎన్నికల సంఘం నియమించినందున ఏదైనా ఆప్షన్ ఉందా అని అడిగారు. దీనికి స్పందనగా మీరు రిటైర్మెంట్ కావడానికి ఇంకా ఏడాది ఉందని తెలుసుకున్నాను.. మా ప్రభుత్వంలో కూడా మీరే సీఎస్’ అని ఎల్వీకి జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఇక, జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఎల్వీ.. అత్యవసర అంశాలు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా ఈ నెల 30న ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని జగన్ సూచించినట్లు తెలిసింది. ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడలో స్థలాన్ని పరిశీలించాలని జగన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు, వైసీపీ మంత్రుల కోసం పేషీలు సిద్ధమవుతున్నాయి.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.