సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఘన విజయం

Lok Sabha Elections 2019: టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్‌పై 51,333 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ మూడో స్థానానికే పరిమితమయ్యారు.

news18-telugu
Updated: May 23, 2019, 5:23 PM IST
సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఘన విజయం
కిషన్ రెడ్డి (ఫైల్)
  • Share this:
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్‌పై 62,960 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. కిషన్ రెడ్డికి 42.3 శాతం ఓట్లు దక్కగా, సాయికిరణ్‌కు 34.9 శాతం, అంజన్ కుమార్ యాదవ్‌కు 18.9 శాతం ఓట్లు వచ్చాయి. ఇక, ఈసారి కిషన్ రెడ్డి గెలవడం, కేంద్రంలో కూడా బీజేపీ అధికారాన్ని చేపట్టనుండడంతో మరోసారి సికింద్రాబాద్ తన ప్రత్యేకతను చాటుకుంది. గతంలో కూడా 2014లో బండారు దత్తాత్రేయ ఈ స్థానం నుంచి గెలవగా, కేంద్రంలో బీజేపీ సర్కార్, 2004, 2009లో అంజన్ కుమార్ యాదవ్ గెలవగా కేంద్రంలో UPA సర్కార్ ఏర్పడ్డ విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్.. ఈ ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితం కానుంది. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో సిట్టింగ్ ఎంపీ కవిత వెనుకంజలో ఉన్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 23, 2019, 4:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading